Makar Sankranti 2024: సంక్రాంతి రోజున సూర్యునికి ఆర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు, ఎలా చేయాలి

Makar Sankranti 2024: తెలుగు వాకిళ్లలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ మొదటి రోజు భోగి మంటల వెలుతురుతో పండుగ శోభ మొదలైంది. సంక్రాంతి సందర్భంగా సూర్య భగవానుడిని ప్రార్ధించడం అనాదిగా వస్తున్న ఆచారం. సంక్రాంతి నాడు ఆర్ఘ్యం ఎలా సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 14, 2024, 03:52 PM IST
Makar Sankranti 2024: సంక్రాంతి రోజున సూర్యునికి ఆర్ఘ్యం ఎందుకు సమర్పిస్తారు, ఎలా చేయాలి

Makar Sankranti 2024: మకర సంక్రాంతి పండుగ తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే వేడుక. ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికి అందిన సందర్భంగా పల్లెలన్నీ ముస్తాబయ్యే సందర్భం. దేశంలో చాలా ప్రాంతాల్లో జరుపుకున్నా..తెలుగువాకిట జరుపుకునేది మరింత ప్రాధాన్యత సంతరించుకుని ఉంటుంది. 

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సందర్బంగా మకర సంక్రాంతి జరుపుకుంటారు. మొత్తం ప్రపంచానికి వెలుతురునిచ్చే సూర్య భగవానుడిని ఈ సందర్భంగా కొలుస్తారు. సూర్యుని కదలికను బట్టే రుతువులు, ఉత్తర, దక్షిణాయనాలు ఏర్పడతాయి. సూర్యుని కిరణాలకు ఉన్న ప్రాముఖ్యత, మహత్యం దృష్ట్యా సూర్యుని తప్పకుండా ప్రార్ధిస్తారు. ముఖ్యంగా మకర సంక్రాంతి వేళ సూర్యుని ఆరాధించడం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయంటారు. సర్యుని పూజించడం వల్ల జీవితంలోని అన్ని బాధలు, కష్టాలు తొలగిపోతాయని అంటారు. అందుకే మకర సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తారు. సూర్యునికి ఆర్ఘ్యం ఎలా సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

మకర సంక్రాంతి రోజున తెల్లవారముజాము బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేనిచ స్నానం చేయాలి. పసుపు లేదా ఎరుపు బట్టలు ధరించాలి. సూర్యుని వైపు తిరిగి సూర్య నమోస్తు అని 21 సార్లు పఠించాలి. ఓ రాగి పాత్రలో నీళ్లు తీసుకుని అందులో ఎర్ర చందనం, ఎర్రటి పూలు, అక్షింతలు వేసుకోవాలి. రాగి పాత్రను రెండు చేతులతో పట్టుకుని ఉదయిస్తున్న సూర్యునివైపు తిరిగి నిలబడాలి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించి మంత్రాలు జపించాలి.ఈ సమయంలో ఓం సూర్యాయ నమహ, ఓం ఆదిత్యాయ నమహ, ఓం నమో భాస్కరాయ నమహ మంత్రాలు పఠించాలి. నీళ్లు కింద నేలపై పడకూడదు. ఇంట్లోని పూలమొక్క లేదా పరిశుభ్రమైన పాత్రలో పడేట్టు చేయాలి. చివరిగా అక్కడే మూడు సార్లు ప్రదక్షిణలు చేసి సూర్యునికి నమస్కరించాలి. 

Also read: Mangal Uday 2024: ధనుస్సు రాశిలో ఉదయించబోతున్న కుజుడు.. ఈరాశులపై తీవ్ర ప్రభావం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News