Guru Pushya Nakshatra Importance: జ్యోతిష్యశాస్త్రంలో గురు పుష్య నక్షత్రం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. గురువారం పుష్య నక్షత్రం రాగానే గురు పుష్య యోగం ఏర్పడుతోంది. ఈ ఏడాది తొలి గురు పుష్య నక్షత్రం జనవరి నెలలో కనిపించబోతుంది. ఈరోజున షాపింగ్ మరియు శుభకార్యాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. గృహప్రవేశం, కొత్త పనులు ప్రారంభించడం శుభకరంగా భావిస్తారు. గురు పుష్య నక్షత్ర కాలంలో కొన్ని ప్రత్యేక వస్తువులను కొనుగోలు చేయడం వల్ల మీరు చాలా లాభాలను పొందుతారు.
శుభ ముహూర్తం
ఈ గురు పుష్య నక్షత్రం శుభ ముహూర్తం ఈ నెల 25, ఉదయం 8:16 నుండి జనవరి 26న ఉదయం 10:28 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో శుభకార్యాలు, షాపింగ్ చేయడం మంచిది. ముఖ్యంగా గురుపుష్య నక్షత్రంలో బంగారు కొనుగోలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.
ఈ పనులు చేయడం శుభప్రదం
** గురు పుష్య నక్షత్రం సమయంలో బంగారంతో పాటు వెండి ఆభరణాలు వంటివి కొనుగోలు చేయడం వల్ల మీ సంపద పెరుగుతుంది. ఈరోజున గోల్డ్ లేదా సిల్వర్ లక్ష్మీ లేదా గణేష్ నాణెం కొనండి.
** గురు పుష్య యోగం సమయంలోల్యాండ్ మరియు ఆస్తులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈరోజున కొన్న ఆస్తి చాలా సంవత్సరాల పాటు ప్రయోజనాలను ఇస్తుంది.
** గురు పుష్య యోగ సమయంలో శెనగ పప్పు కొనడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. ఎందుకంటే దేవగురువు బృహస్పతి ఆరాధనలో పప్పు ప్రసాదం పక్కా ఉండాలి.
** ఇదే కాలంలో పూజకు సంబంధించిన పుస్తకాలు, శంఖం, చందనం, కుంకుడు మొదలైన వాటిని కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
** గురు పుష్య యోగంలో ఏమీ కొనకూడదనుకునే వారు శ్రీ సూక్తాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి ప్రసన్నురాలయి ఐశ్వర్యాన్ని, ధాన్యాన్ని ఇస్తుంది.
Also Read: Zodiac Signs: ఈ రాశుల వారిపై సిద్ధయోగం ఎఫెక్ట్.. ఈ రోజు నుంచి జరగబోయేది 100 శాతం ఇదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook