ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, బీఎస్ఎన్ఎల్లు కలిసి సంయుక్తంగా ఓ ఆఫర్‌ను అందిస్తున్నాయి. ఈ కొత్త ఆఫర్ ప్రకారం.. బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్, బ్రాడ్‌బ్యాండ్ సేవలను వాడుతున్న కస్టమర్లకు ఏడాదిపాటు ఉచితంగా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ లభిస్తుంది.
రూ.399 లేదా ఆపైన విలువ గల బీఎస్ఎన్ఎల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ మరియు రూ.745 లేదా ఆపైన విలువ గల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను వాడుతున్న కస్టమర్లకు ఈ ఆఫర్‌ను వర్తించనుంది. అమెజాన్, బీఎస్ఎన్ఎల్ సంయుక్తంగా కలిసి రూ.999కే ఏడాది కాలానికి అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను అందిస్తున్నారు.
గతంలో ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా తమ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించగా, తాజాగా ఆ జాబితాలోకి బీఎస్ఎన్ఎల్ వచ్చింది.
అమెజాన్ ప్రైమ్ వీడియో యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
- ఇప్పటికే ఉన్న పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను రూ.399 లేదా అంతకంటే ఎక్కువకు మరియు ప్రస్తుత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను రూ .745 లేదా అంతకంటే ఎక్కువకు అప్‌గ్రేడ్ చేసుకోండి.
- బీఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్‌కి వెళ్లి 'బీఎస్ఎన్ఎల్-అమెజాన్ ఆఫర్' బ్యానర్‌పై క్లిక్ చేయండి.
- అనంతరం మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి ఓటీపీని జనరేట్ చేసుకోవాలి. తర్వాత ఆఫర్‌ను కన్ఫామ్ చేసుకుంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ యాక్టివేట్ అవుతుంది.
- మీ స్మార్ట్ ఫోన్/ స్మార్ట్ టీవీ/ ఫైర్ టీవీలో ప్రైమ్ వీడియో యాప్‌ను డౌన్లోడ్ చేయండి లేదా primevideo.comకి వెళ్ళండి. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ లభించిన వారికి వేలాది దేశీయ, అంతర్జాతీయ సినిమాలు, వీడియోలు, మ్యూజిక్, టీవీ షోలు తదితర సేవలు ఉచితంగా లభిస్తాయి.