సిరిసిల్లలో గురువారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్-హరీశ్ రావు ఒకే వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..తాను హరీశ్‌రావు కలిసి అన్నదమ్ముల్లా కలిసి పెరిగామని వ్యాఖ్యానించారు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు తామిద్దరి మధ్య పోటీ ఉన్న విషయం వాస్తమేనని.. అయితే పదవుల విషయంలో కాదని.. అభివృద్ధిలో పోటీ పడుతున్నామని చమత్కరించారు. తెలంగాణ ప్రజల బతుకులతో ముడిపడి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను హరీశ్ పరిగెత్తిస్తున్నారని ప్రశంసించారు. మరో 15 ఏళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి.. తెలంగాణకు ప్రజలకు మంచి జరుగుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ మీడియా వాళ్లు అనుకంటున్నట్లు కేటీఆర్ తో తనకు మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవన్నారు. భవిష్యత్లులో కూడా తాముఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకుపొతామన్నారు. ఆత్మహత్యల సిరిసిల్ల.. సిరుల ఖిల్లాగా మారిందంటే అది కేటీఆర్ కృషేనని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ ను సిరిసిల్ల ప్రజలు సిద్ధిపేటకంటే బ్రహ్మాండమైన మెరార్టీతో గెలిపిస్తారని హరీశ్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ లో చీలిక వచ్చిందని.. కేటీఆర్ వర్గం.. హరీష్ వర్గంగా చీలిపోయిందని వార్తలు హల్ హల్ చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడు కేటీఆర్ ను ప్రొమోట్ చేసేందుకు సీఎం కేసీఆర్ ..ఆయన మేనల్లుడు మంత్రి హరీశ్ రావుకు ప్రాధాన్యత తగ్గించారనే పుకార్లు వినిపించాయి. ఈ క్రమంలో సిద్ధిపేట కార్యకర్తల సమావేశంలో హరీశ్ నోట 'పొలిటికల్ రిటైర్ట్ మెంట్' పదం వినిపించగానే కేటీఆర్ తో పడలేకలే హరీశ్ తన దారి తాను చూసుకుంటున్నారనే వార్త చల్ చల్ చేసింది...ఇదే తరుణంలో కొండా సురేఖ టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సందర్భంలో చేసిన ప్రకటన చర్చనీయంశంగా మారింది. తాము హరీశ్ వర్గంలో ఉండటం వల్లే టికెట్ ఇవ్వలేదని కొండా దంపతులు బాంబు పేల్చారు. దీంతో టికెట్ల కేటాయింపుల విషయంలో హరీశ్- కేటీఆర్ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయని...హరీశ్ టీఆర్ఎస్ పార్టీని చీల్చి బయటికి వస్తున్నారని పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్-హరీశ్ రావులు ఇలా ఒకే వేదికపై వచ్చి ఇలా వివరణ ఇచ్చుకున్నారు.