Benefits Of Guava Leaves: జామ పండ్ల కంటే శరీరానికి వాటి ఆకులే ఎక్కువ మేలు చేస్తాయి..ఎంటి నమ్మట్లేదా?

Guava Leaves Benefits In Telugu: శరీరానికి జామ పండ్లే కాకుండా వాటి ఆకులు కూడా ఎంతగానో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుల్లో ఉండే ఆయుర్వేద గుణాలు అనేక రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా దంతాల సమస్యలను కూడా దూరం చేస్తాయి.

Written by - Shashi Maheshwarapu | Last Updated : Feb 1, 2024, 12:44 AM IST
Benefits Of Guava Leaves: జామ పండ్ల కంటే శరీరానికి వాటి ఆకులే ఎక్కువ మేలు చేస్తాయి..ఎంటి నమ్మట్లేదా?

Guava Leaves Benefits In Telugu: సీజనల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో శక్తినిస్తాయి అంతేకాకుండా సీజనల్ వ్యాధుల నుంచి కూడా శరీరాన్ని రక్షించేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా సీజనల్ ఫ్రూట్స్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా జామ పండ్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి పోలేడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జామ పండ్లలో ఉండే గుణాలు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా దగ్గు, జలుబు సమస్యలు రాకుండా శరీరాన్ని కాపాడుతాయి. ఇవే కాకుండా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఉపశమనం లభిస్తుంది. జామ పండ్లతో పాటు శరీరానికి ఆకులు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలను కలిగిస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

జామ పండ్ల కంటే ఆకుల్లో శరీరానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆకులను కూడా వినియోగించవచ్చని వారంటున్నారు. ముఖ్యంగా దంత సమస్యలు మధుమేహం ఉన్నవారు ఈ ఆకులను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే జామ ఆకులను ఎలా వినియోగించాలో, వాటి వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.

దంత సమస్యలు దూరమవుతాయి:
చిగుళ్లలోని బ్యాక్టీరియా పేరుకుపోయి దంతాల సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా క్యావిటీస్ తో పాటు దంతాల నుంచి రక్తస్రావం అవ్వడం ఇతర సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి జామ ఆకులను ప్రతి రోజు ఉదయం పూట నమాలాల్సి ఉంటుంది. ప్రతిరోజు నమలడం వల్ల దంతాల సమస్యలు దూరం కావడమే కాకుండా నోటి నుంచి వచ్చే దుర్వాసన తొలగిపోతుంది. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌
మధుమేహాన్ని నియంత్రిస్తుంది:
మధుమేహం సమస్యలతో బాధపడే వారికి జామ ఆకులు ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు కూడా సహాయపడతాయి. ముఖ్యంగా తరచుగా రక్తంలోని చక్కర పరిమాణాలు పెరగడం తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు భోజనం చేసిన తర్వాత.. జామ ఆకులతో తయారు చేసిన టీని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రించేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News