Silver Anklets: పాదాలకు బంగారం పట్టీలు ఎందుకు ధరించకూడదు ? కలిగే నష్టాలు ఏంటి..

Benefits Of Wearing Silver Anklets: మహిళలు పాదాలకు వెండి పట్టీలు ధరించడం అనేది హిందూ సంప్రదాయాల్లో ఒకటి. పట్టీలు ధరించడం ఎన్నో లాభాలను పొందవచ్చని మన శాస్త్రాలు చెబుతున్నాయి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2024, 05:53 PM IST
Silver Anklets:  పాదాలకు బంగారం పట్టీలు ఎందుకు ధరించకూడదు ? కలిగే నష్టాలు ఏంటి..

Benefits Of Wearing Silver Anklets: మహిళలు కాళ్ళ పట్టీలు వేసుకోవడం అనేది భారతీయ సంప్రదాయం. పట్టీలను ఎక్కువగా మహిళలు వెండితో చేసినవీ వేసుకుంటారు. ఈ పట్టీలను ఆడపిల్ల పుట్టనప్పుడు తొడుగడం హిందూ సంప్రదాయం. పట్టీలు తొడుక్కుని ఆడపిల్లలు ఇంట్లో నడిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని పండితులు, పెద్దలు చెబుతారు. 

అయితే పట్టీలను వెండితో చేసి వేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం చాలా మంది వెండి పట్టీలు కన్నా బంగారంతో చేసి పట్టీలను తొడుగుతున్నారు. ఇలా బంగారంతో చేసిన పట్టీలను ధరించడం అసలు మంచిది కాదని శాస్త్రీకయంగా , పురాణాలు చెబుతున్నాయి. బంగారం పట్టీలను ఎందుకు ధరించకూడదు? వెండి పట్టీలు వేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.

సాధార‌ణంగా హిందూ పురాణాల ప్ర‌కారం బంగారం అనేది సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే ఎంతో ఇష్టమని చెబుతున్నాయి. అయితే బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది కాబట్టి వీటిని ధరించకూడదని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా బంగారం శరీరంలో వేడిని పెంచుతుంది. 

అయితే వెండి పట్టీలు వేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలను పొందవచ్చని వైద్యులు, శాస్త్రాలు చెబుతున్నాయి. వెండి పట్టీలను ధరించడం వల్ల శరీరంలో ఉండే వేడి బయటకు పోతుందని వైద్యలు, శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక పాదాలకు వెండితో తయారు చేసిన ఆభరణాలు ధరిచడం చాలా మంచిది.  వెండి పట్టీలు వేసుకోవడం వల్ల నడుము నొప్పి, మోకాళ్ల నొప్పులు, నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పిని కూడా తగ్గిస్తుంది.  

వెండి పట్టిలను వేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. పాదాలకు వెండి పట్టీలు ధరించడం వల్ల మహిళల్లో హార్మోన్‌ లెవెల్స్ అదుపులో  ఉంటాయి.  గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో వెండి పట్టీలు ఎంతో మేలు చేస్తాయి. మహిళలలో కలిగే పాదాల నొప్పి సమస్యను తగ్గించడంలో వెండి పట్టీలు పరిష్కరిస్తాయి.

కాబట్టి  బంగారం పట్టీలు ధరిచడం  కంటే వెండి పట్టీలను ధరించడం ఎంతో మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే వెండి పట్టీలను ధరించడం చాలా మేలు. 

Also Read Shani Surya yuti 2024: 30 ఏళ్ల తర్వాత శని-సూర్యుల కలయిక.. ఫిబ్రవరిలో ఈ 4 రాశులకు కష్టాలే ఇక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News