హైదరాబాద్: రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ -విండీస్ రెండో టెస్టు మొదలైంది. ఉదయం టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఘోర పరాజయం మూటగట్టుకున్న వెస్టిండీస్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. కీమర్ రోచ్, లూయిస్ స్థానాల్లో కీమోపాల్, వారికాన్ లను తీసుకుంది. ప్రయోగాలకు సిద్ధపడిన భారత్ కూడ కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇస్తోంది. ఈ మ్యాచ్ తో భారత్ తరఫున యువ బౌలర్ శార్దుల్ ఠాకుర్ అంతర్జాతీయ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
ఇదిలా ఉండగా తొలి టెస్టులో ఘోర పరాజయం మూటగట్టుకున్న విండీస్ నిలకడగా ఆడేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు కోహ్లీసేన రాజ్ కోట్ ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. తొలి రోజు విండీస్ ను దెబ్బతీసి మ్యాచ్ పై పట్టుబిగించాలనే వ్యూహంతో టీమిండియా బరిలోకి దిగింది. దీంతో ఈ మ్యాచ్ ఉత్కంఠతకు దారితీస్తోంది. ప్రస్తుతం విండీస్ 15 ఓవర్లలో వికెట్లేమీ కోల్పోకుండా 40 పరుగుల చేసింది. ఓపెనర్లు క్రైగ్ బ్రాత్ వైట్ 12 , కేరన్ పావెల్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు