First hindu temple UAE: ముస్లిం దేశమైన యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా?

First hindu temple UAE: అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రారంభోత్సవం జరిగి 20 రోజులు అయ్యింది. దీని తర్వాత త్వరలో మరో పెద్ద ఆలయాన్ని ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. విశేషమేమిటంటే ఈ ఆలయాన్ని భారతదేశంలో నిర్మించడం లేదు. ముస్లిం దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో ఉంది.

Written by - Renuka Godugu | Last Updated : Feb 13, 2024, 02:37 PM IST
First hindu temple UAE: ముస్లిం దేశమైన యూఏఈలో తొలి హిందూ దేవాలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా?

First hindu temple UAE: అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రారంభోత్సవం జరిగి 20 రోజులు అయ్యింది. దీని తర్వాత త్వరలో మరో పెద్ద ఆలయాన్ని ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. విశేషమేమిటంటే ఈ ఆలయాన్ని భారతదేశంలో నిర్మించడం లేదు. ముస్లిం దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో ఉంది.

ఈ ఆలయాన్ని ఫిబ్రవరి 14న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. 700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ అద్భుత ఆలయాన్ని BAPS స్వామినారాయణ్ ఇనిస్టిట్యూట్ నిర్మించింది. ఈ ఆలయాన్ని నిర్మించడంలో ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహరాజ్ సహకారం అపారమైంది.

ఇదీ చదవండి: Vasantha Panchami 2024: రేపే వసంతపంచమి.. ఈ రంగు దుస్తులు ధరించి పూజిస్తే లక్ష్మీకటాక్షమే..!

మహంత్ స్వామి మహరాజ్ కొద్ది రోజుల క్రితం ఆలయ ప్రారంభోత్సవం కోసం అబుదాబి వెళ్లారు. ఇంతకీ ఆయన ఎవరు? వారి నేపథ్యం గురించి తెలుసుకుందాం.

మహంత్ స్వామి మహారాజ్ BAPS స్వామినారాయణ్ ఇన్స్టిట్యూట్ ఆరవ, ప్రస్తుత ఆధ్యాత్మిక గురువు. ఆయన పేరు స్వామి కేశవజీవందాస్ జీ. కానీ భక్తులు ఆయనను మహంత్ స్వామి మహారాజ్ అని పిలుచుకుంటారు. ఈయన 1933 సెప్టెంబర్ 13న మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నగరంలో దహిబెన్ ,మణిభాయ్ నారాయణభాయ్ పటేల్ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉండేది. ఒకరోజు స్వామి నారాయణ్ సంస్థకు చెందిన శాస్త్రిజీ మహారాజ్ జబల్పూర్ వచ్చినప్పుడు అతను ఈ బిడ్డను ఆశీర్వదించి 'కేశవ' అని పేరు పెట్టాడు.

ఇదీ చదవండి: ఈ రాశికి 200 ఏళ్ల తర్వాత రాజయోగం.. కీర్తి ప్రతిష్ఠలు అన్నింటా విజయం!

కేశవ తన పాఠశాల విద్యను జబల్‌పూర్‌లో పూర్తి చేసి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపి 1951-52లో బ్రహ్మస్వరూప శాస్త్రీజీ మహారాజ ఆధ్యాత్మిక వారసుడు పవిత్ర యోగిజీ మహరాజ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాడు. 1957లో యోగీజీ మహారాజ్ ఆయనకు దీక్షను అందించారు. అనంతరం అక్షరధామ్ ఆలయ నిర్మాణంలో తన సేవలను అందించారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News