Symptoms of periods: నెలసరి అంటే ఏమిటి, మొదటి సారి నెలసరి వస్తే ఏం చేయాలి, లక్షణాలెలా ఉంటాయి

Symptoms of periods: మహిళలకు నెలసరి అనేది చాలా సాధారణమైన సమస్య. జీవితంలో భాగం. ప్రతి నెలా క్రమం తప్పకుండా జరిగే ఈ ప్రక్రియతో చాలావరకూ రక్తం పోతుంటుంది. అసలు నెలసరి  ప్రారంభమయ్యే వయస్సు ఎంత, ఎంతవరకూ బ్లడ్ లాస్ అవుతుందనేది తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 21, 2024, 09:17 PM IST
Symptoms of periods: నెలసరి అంటే ఏమిటి, మొదటి సారి నెలసరి వస్తే ఏం చేయాలి, లక్షణాలెలా ఉంటాయి

Symptoms of periods: మహిళలకు తొలిసారి నెలసరి వచ్చేందుకు నిర్ణీతమైన వయస్సు ఉండదు. సాధారణంగా 10ృ-15 ఏళ్ల మధ్యలో రావచ్చు. అయితే కొంతమంది అమ్మాయిలకు మాత్రం 8 ఏళ్లకే నెలసరి మొదలు కావచ్చు. 

పీరియడ్స్ అనేది ప్రతి నెలా జరిగే ఓ ప్రక్రియ. అమ్మాయిల జీవితంలో నెలసరికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. నెలసరి సమయంలో యుటెరస్ పొర వదులుతుంటుంది. ఫలితంగా  చాలా వరకూ రక్తం కోల్పోతుంటారు. ప్రతి నెలా 4-5 రోజులు ఈ ప్రక్రియ తప్పకుండా ఉంటుంది. పీరియడ్స్ ప్రారంభమయ్యేందుకు ఉండే కనీస వయస్సు ఎంతని చాలామందికి సందేహాలుంటాయి. కానీ ప్రత్యేకంగా ఓ వయస్సు ఉండదు. పిల్లల మానసిక, ఆరోగ్య స్థితిని బట్టి మారుతుంటుంది. అమ్మాయిల్లో హార్మోన్ల విడుదల, శరీర ఆకృతి, జీన్స్ వంటివి ప్రబావం చూపిస్తుంటాయి. 8-15 ఏళ్ల మధ్యలో రావచ్చు లేదా 10-15 ఏళ్లకు రావచ్చు లేదా కొందరికి 16 ఏళ్లయినా రాకపోవచ్చు. 8 ఏళ్లకే కొందరికి నెలసరి ప్రారంభమౌతుంటుంది.

మహిళలకు తొలిసారి నెలసరి వచ్చినప్పుడు అదేంటో కూడా వారికి అర్ధం కాని పరిస్థితి ఉంటుంది. నెలసరి ప్రారంభమయ్యే ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తుంటాయి. కాళ్లు, అండర్ ఆర్మ్స్, వెజీనాపై కేశాలు వస్తాయి. నెలసరి ప్రారంభమయ్యేముందు వెజీనా నుంచి చిన్న చిన్న రక్తపు మరకలు కన్పిస్తుంటాయి. ముఖంపై పింపుల్స్ వస్తాయి. ఛాతీ, వీపు, నడుము తీవ్రంగా నొప్పి ఉంటుంది. మలబద్ధకం ఉంటుంది. మొదటి సారి నెలసరి వచ్చినప్పుడు బ్లీడింగ్ తక్కువే ఉంటుంది. నెమ్మదిగా హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. మొదటిసారి నెలసరి అయినప్పుడు  6 స్పూన్ల రక్తం రావచ్చుు. అంతకుమించి బ్లీడింగ్ అయిా కంగారు పడాల్సిన అవసరం లేదు..

మొదటిసారి నెలసరి అయితే ఏం చేయాలి

తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు నెలసరి విషయంయలో అమ్మాయిలకు అవగాహన కల్పించాలి. నెలసరి జరిగినప్పుడడు బట్టలు కాకుండా శానిటరీ నాప్కిన్స్, ప్యాడ్ వినియోగించాల్సి ఉంటుంది.  ప్రతి 5-6 గంటలకు ప్యాడ్ మారుస్తుండాలి. శరీరం ఎప్పటికప్పుడు హైడ్రేట్‌గా ఉండాలి. రోజూ తేలికపాటి వ్యాయమం చేయించాలి. ఫలితంగా ఆరోగ్యంగా ఉంటారు. నెలసరి గురించి గోప్యత ఉండకూడదు. దానిపై చర్చ జరగాలి

Also read: Reduce Bad Cholesterol: ఒంట్లో చెడు కొవ్వు వెన్నలా కరగడానికి ఈ ఒక్క డైట్‌ పాటిస్తే చాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News