World's Largest Snake Video: ప్రపంచంలో రకరకాల పాములు ఉన్నాయి. సాధారణంగా ఈ పాములు విషపూరిత జీవాలు. మాములు పాములు కాకుండా మీరెప్పుడైనా భారీ అనకొండను చూశారా? చూస్తేనే అతి భయానకంగా, ఒళ్లుగగ్గుర్పిడిచే వీడియోను ఈరోజు మేం మీకు చూపించబోతున్నాం. అనకొండ పాముల వీడియోలు యూట్యూబ్‌లో ఎన్నో ఉన్నాయి. ఈ వీడియోలు చూసినవారు ఇన్ని రోజులూ అనకుంటున్న అనకొండ పాము జాతులు ఇవేనా? అని ఉత్సాహంగా చూస్తున్నారు.
అమెజాన్ అడవి ప్రపంచంలోనే అత్యంత పెద్ద అడవి. ఇక్కడ రకరకాల జంతువులు, పక్షులు, విషసర్పలు, జలచరాలు నివసిస్తాయి. కానీ, ఈ అడవికి నేనే కింగ్ అన్నట్లు ఓ జెయంట్ అనకొండ కూడా ఉంది. ఈ మధ్యకాలంలో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సాధారణంగా ఇలాంటి భారీ అనకొండలను సినిమాల్లోనే చూస్తాం. నిజజీవితంలో కూడా ఉంటాయో లేవో కూడా చాలామందికి తెలియదు. కానీ, అమెజాన్ అడవుల్లో ఓ భారీ అనకొండ ఊహకందని రూపంతో ఎంతో పొడవుతో ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరుగనిరీతిలో దర్శనమిస్తోంది ఈ జెయంట్ అనకొండ.
ఇదీ చదవండి: IndiGo Screw Sandwich: శాండ్‌విచ్‌లో ఇనుప బోల్ట్, స్క్రూ.. ఇలా ఉంటే ఎలా తినాలిరా అయ్యా!
The world's largest snake has been discovered in the Amazon Rainforest: The Northern Green Anaconda measures 26 feet long and weighs 440 lbs - and its head is the same size as a human's. pic.twitter.com/XlaDk0qVYt
— Denn Dunham (@DennD68) February 21, 2024
అమెజాన్ అడవుల్లో ఓ నదితీరానా ఓ డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసేటప్పుడు ఈ భారీ అనకొండ కనిపించింది. ప్రొఫెసర్ ఫ్రీక్ ఒంక్ ఈ భారీ అనకొండను ప్రపంచానికి పరిచయం చేశాడు. దీని పొడవు ఒకటి కాదు రెండు కాదు దాదాపు 26 అడుగులు, రెండు వందల కేజీల వరకు బరువు ఉంటుందంట. ఈ అనకొండకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేందబ్బా ఇంత పొడుగ్గా ఉంది ఎప్పుడు చూడలేదు, వినలేదు అని ఉత్సహాంగా చూస్తున్నారట.
ఇదీ చదవండి: Mosquito Tornado: వామ్మో.. దోమల దండయాత్రతో ఉలిక్కిపడిన నగరం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన...
ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ నుంచి హాలివుడ్ వరకు ఎన్నో వేల సంఖ్యలో పాము, అనకొండలకు సంబంధించిన సినిమాలు వచ్చాయి.. వస్తూనేఉన్నాయి. సాధారణంగా అటువంటి సినిమాల్లో అనకొండ అంటే మాములు పాముల పొడుగు కంటె మరింత పొడువుగా ఉంటుందని చూశాం. కానీ, మరీ ఇంత పొడువుగా ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు నెట్టిజెన్స్.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook