Mosquito Tornado: వామ్మో.. దోమల దండయాత్రతో ఉలిక్కిపడిన నగరం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన...

Pune: సాధారణంగా దోమలు మురికిగా ఉన్న ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు దోమలు కాటువేస్తే అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 12, 2024, 07:40 PM IST
  • - దోమల దాడితో భయపడుతున్న ప్రజలు..
    - ఆకాశంలో గుంపులుగా దోమలు..
Mosquito Tornado: వామ్మో.. దోమల దండయాత్రతో ఉలిక్కిపడిన నగరం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన...

Swarm Of Mosquitoes Blanket Pune Sky: సాధారంగా మనం కొన్నిసార్లు దండయాత్ర అనే పదం వాడుతుంటాం.  అంటే ఒక రాజు మరో రాజుపై లేదా.. మరో రాజ్యం ఆక్రమించుకోవడానికి దాడులు చేస్తుంటారు. కొన్నిసార్లు వర్షంపడినప్పుడు గాలిలో ఒక్కసారిగా ఇసుక తుపాన్ లు ఆకాశంలో పైకి లేవడం మనం గమనిస్తుంటాం. అదే విధంగా ఇది వరకే సునామిలు, తుపానులు కూడా రావడం వంటివి చూశాం.

 

అయితే.. కొన్నిసార్లు సాయంత్రం పావురాలు ఒక్కసారిగా పక్షులు ఆకాశంలో గుంపులుగా పైకి ఎగురుతుంటాయి. ఇలాంటి ఘటనలు మనం ఎన్నోసార్లు చూశాం. అయితే.. ఇక్కడ మాత్రం ఒక దోమలు గుంపులుగా ఆకాశంలో ఎగరటం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ వేరే దేశంలో చోటు చేసుకొలేదు. మహరాష్ట్రలోని పూణెలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. 

పూణెలోని ముంధ్వా, కేశవనగర్, ఖరాడి ప్రాంతాలలో దోమలు దండయాత్రలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. దోమలు గుంపులుగా , గుంపులుగా ఇళ్లపై దాడిచేస్తున్నట్లు స్థానికులుచెబుతున్నారు. రాత్రి , సాయంత్రం బాల్కనీలో కూర్చొవాలంటే భయపడే పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. సాయంత్రం పిల్లలు, బాల్కనీలలో కూడా వెళ్లేందుకు భయపడుతున్నారు. దీనిపై ప్రస్తుతం స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More: Keerthy Suresh: కీర్తి సురేష్ కి ప్రేమలేఖ.. ఆ అబ్బాయి గురించి బయట పెట్టిన హీరోయిన్

వెంటనే మున్సిపల్ సిబ్బంది స్పందించి చర్యలు తీసుకొవాలని కోరుతున్నారు. ముఠా నది గర్బంలో కొనసాగుతున్న ప్రాజెక్టులు, ఆనకట్టలతో పాటు, నీటి శుద్ది కర్మాగారంలు అపరిశుభ్రంగా ఉండటం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడున్న వారు దోమల బెడదకు భయపడి ఇంటి నుంచి బైటకు రావాలంటేనే  ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News