Junior Artist Fraud: సామాజిక మాధ్యమాల్లో భారీగా మోసాలు జరుగుతున్నాయి. అమ్మాయిల పేరుతో కొందరు దుండగులు నేరాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిల పేర్లు చెప్పి అందినకాడికి దోచుకుంటున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఇదే పని చేశాడు. అమ్మాయి పేరుతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి డబ్బులు దండుకుంటున్నాడు. వలపు విసిరి వివిధ కారణాలతో తీసుకున్న డబ్బులు తిరిగివ్వాలని బాధితుడు కోరడంతో ఆర్టిస్ట్ చేస్తున్న మోసాలు వెలుగులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిల పేరుతో మోసం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఏపీలోని విశాఖపట్టణంలో చోటుచేసుకుంది.
Also Read: Momos: భార్యాభర్తల మధ్య 'మోమోస్' చిచ్చు.. విడాకులివ్వాలని కేసు పెట్టిన భార్య
విశాఖపట్టణానికి చెందిన తమ్మారెడ్డి శశాంక్ రెడ్డి (24) జూనియర్ ఆర్టిస్ట్. సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. సులువుగా డబ్బులు సంపాదించేందుకు పథకం పన్నాడు. సోషల్ మీడియానే అస్త్రంగా చేసుకుని డబ్బులు దండుకోవాలని ప్రణాళిక రచించాడు. ఈ క్రమంలో నకిలీ ఐడీలతో సామాజిక మాధ్యమాల్లో అకౌంట్లు తెరిచాడు. అమ్మాయిల పేరిట ఆ అకౌంట్లు తెరచి సోషల్ మీడియాలో పురుషులను ఆకర్షించేవాడు. ఈ క్రమంలోనే మేఘనా రఘుపాత్రుని పేరిట ఓ అకౌంట్ తెరిచాడు.
Also Read: RPF Jobs: టెన్త్, డిగ్రీ చదివితే చాలు.. రైల్వేలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగం ఇట్టే కొట్టేయొచ్చు
ఆ అకౌంట్ నుంచి ఒకరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. అమ్మాయి కావడంతో ఆయన సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడు. అమ్మాయిగా భావించి అతడు చాటింగ్ చేస్తుండేవాడు. ఆ చాటింగ్‌లో వలపు విసిరేలా మాటలు ఉండేవి. అంతేకాకుండా రెచ్చగొట్టే మాదిరి చాటింగ్ చేస్తుండడంతో బాధితుడు నేరుగా కల్లుద్దామని చెప్పారు. అయితే కేవలం చాటింగ్ మాత్రమే చేద్దాం.. అని చెప్పేవాడు. నేరుగా కలిస్తే తన వ్యవహారం బయట పడుతుందని భావించి కలిసేందుకు నిరాకరించేవాడు.
అతడు తన వలకు చిక్కాడని భావించి వెంటనే డబ్బులు దండుకునే పని మొదలుపెట్టాడు. మేఘన తమ్ముడి పేరుతోనే ఫోన్ చేశాడు. పరిచయం చేసుకుని తన సెల్‌ఫోన్ నంబరుకు పేటీఎం, ఫోన్‌పే ద్వారా డబ్బు అడుగుతున్నాడు. అమ్మాయి సోదరుడిగా భావించి అతడు అడిగినంత పంపించడం మొదలుపెట్టాడు. తల్లి మరణించిందని, ఆసుపత్రి ఖర్చులు, ఇంటి అద్దె, ఈఎంఐలు పేరుతో ఇప్పటివరకు రూ.1.05 లక్షలకు పైగా శంశాక్ రెడ్డి డబ్బును తీసుకున్నాడు.
అయితే ఎంతకీ కలవకుండా కేవలం చాటింగ్‌లోనే ఉండడం.. పంపిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చింది. తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతుండడంతో ఏదో ఒక కారణం చెబుతూ కాలం వెళ్లదీస్తున్నాడు. విసిగి వేసారిపోయిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. సెల్‌ఫోన్ నంబర్, సోషల్ మీడియా అకౌంట్ల తదితర వివరాలను పోలీసులకు చెప్పాడు. మేఘన పేరు మీద శంశాక్ రెడ్డి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇలాంటి నకిలీ ఐడీలతో చాలా మందిని శంశాక్ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అతడిని అరెస్ట్ చేశారు. శశాంక్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిల పేరిట వస్తున్న అకౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు సూచిస్తున్నారు. డబ్బులు, వ్యక్తిగత వివరాలు ఇవ్వొద్దని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి