PKL 2024: పీకేఎల్‌ పదో సీజన్‌ విజేతగా పల్టాన్‌.. ఫైనల్లో హరియాణాపై గెలుపు..

PKL 2024: పీకేఎల్‌ పదో సీజన్‌ తుదిపోరులో పుణెరి పల్టాన్‌ ఘన విజయం సాధించింది. చివరి పోరులో హర్యాసా సీల్టర్ ను ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది పుణెరి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2024, 08:29 AM IST
PKL 2024: పీకేఎల్‌ పదో సీజన్‌ విజేతగా పల్టాన్‌.. ఫైనల్లో హరియాణాపై గెలుపు..

Pro Kabaddi 2024 winner: ఉత్కంఠకు తెరపడింది. ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) సీజన్‌-10 విజేతగా పుణెరి పల్టన్‌ నిలిచింది. శుక్రవారం హైదరాబాద్‌ వేదికగా జరిగిన పైనల్ పోరులో హర్యానా స్టీలర్స్‌పై పల్టన్‌ విజయం సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. గత రెండు పర్యాయాలు తుది మెట్టుపై బోల్తా కొట్టిన పుణెరి పల్టన్ ఈ సారి ఆ అడ్డంకిని బ్రేక్ చేసి ఛాంపియన్ గా నిలిచింది. తుదిపోరులో  పల్టన్‌ 28-25తో హర్యానా స్టీలర్స్‌పై విజయ ఢంకా మోగించింది. పల్టన్‌ జట్టు తరుపున పంకజ్‌ మోహిత్‌ 9 రైడ్‌ పాయింట్లతో చెలరేగగా.. మోహిత్‌ గోయత్‌ (5 పాయింట్లు), అస్లమ్‌ ఇమాన్‌దార్‌ (4 పాయింట్లు), డిఫెండర్‌ గౌరవ్‌ ఖత్రి (4 పాయింట్లు) రాణించారు. 

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) సీజన్‌-10 టైటిల్ పోరు శుక్రవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో జరిగింది. ఇరు జట్టులో హోరాహోరీగా తలపడ్డాయి. వరుసగా రెండో ఏడాది  ఫైనల్ కు చేరుకున్న పల్టన్‌ ఈసారి అద్భుతంగా ఆడింది. తుది పోరులో ఇరుజట్లు రైడింగ్‌లో సమంగా నిలవగా.. పల్టన్‌ డిఫెన్స్‌ ముందు హర్యానా తేలిపోయింది. తొలి అర్థభాగంలో 7-7తో సమంగా నిలిచాయి ఇరు జట్లు. ఆ తర్వాత పంకజ్ చెలరేగడంతో పుల్టాన్ ఆధిక్యం సాధించింది. దీంతో ప్రథమార్థం ముగిసేసరికి పల్టన్‌ 13-10తో ముందంజలో నిలిచింది. సెకండ్‌ హాప్‌లో హర్యానా కాస్త పుంజుకున్నప్పటికీ పుల్టన్ పట్టు ముందు నిలవలేకపోయింది. ద్వితీయార్ధంలో హర్యానా, పల్టన్‌ చెరో 15 పాయింట్లు సాధించినప్పటికీ.. ఫస్ట్ ఆఫ్ లో పుణెరి ఆధిక్యం ఉండటంతో ఆ జట్టు విజేతగా నిలిచింది. హర్యానా స్టీలర్స్‌ తరఫున శివ (6), సిద్ధార్థ్‌ దేశాయ్‌ (4), వినయ్‌ (3) రాణించారు. విజేతగా నిలిచిన పుణెరి పల్టాన్‌కు రూ.3 కోట్లు నగదు బహుమతి అందుకోగా.. రన్నరప్‌ హరియాణా రూ.1.8 కోట్లు లభించాయి. 

Also Read: Yashasvi Jaiswal: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో జైస్వాల్.. ధర్మశాల టెస్టులో నెరవేరుతుందా?

Also Read: Team India squad: బుమ్రా ఇన్‌.. రాహుల్ ఔట్... ఐదో టెస్టుకు భారత జట్టు ఇదే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News