Sasivadane: ‘శశివదనే’ నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదల.. హృదయాన్ని హత్తుకుంటున్న పాట..

Sasivadane Lyrical Song: శశివదనే చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట విడుదలై ప్రేక్షకులను మరింత మెప్పిస్తోంది..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2024, 10:16 AM IST
Sasivadane: ‘శశివదనే’ నుంచి మరో లిరికల్ సాంగ్ విడుదల.. హృదయాన్ని హత్తుకుంటున్న పాట..

Sasivadane:
‘పలాస 1978’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాతో పాటు ఆ సినిమాలోని పాటలు కూడా ఎంతగానో హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని నాది నెక్కిలెస్ గొలుసు పాటకి ఈమధ్య గుంటూరు కారంలో మహేష్ బాబు కూడా స్టెప్పులు వేశారు. ఇక అలాంటి సినిమాలో అద్భుతమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్న హీరో రక్షిత్ అట్లూరి. ఈ హీరో ఇప్పుడు మరోసారి మరో వైవిద్యమైన కథతో మన ముందుకి వస్తున్నాడు.

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తోన్న చిత్రం ‘శశివదనే’. కోమలి కథానాయికగా నటిస్తోంది.  ‘మనసులో పుట్టే ప్రేమ మచ్చలేనిదైతే ఆ ప్రేమకు మరణం కూడా మనతోనే’ అంటూ  హృదయాన్ని హత్తుకునే గ్రామీణ నేపథ్యంలో ప్రేమకథాంశంగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చేనెల ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర మేకర్స్ ఈ సినిమా నుంచి ‘ఏమిటో ఏమిటో..’ అనే పాటను విడుదల చేశారు. 

హీరోయిన్‌పై మనసుపడ్డ హీరో తన మనసులో చేలరేగె భావాలను పాట రూపంలో వ్యక్తం చేసే క్రమంలో వచ్చే పాటగా ఈ సాంగ్ లిరిక్స్ విన్నవారిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.  పి.వి.ఎన్.ఎస్.రోహిత్ పాడిన ఈ పాటను కరుణాకర్ అడిగర్ల లిరిక్స్ ఇచ్చారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ అందరినీ అలరిస్తోంది.

గౌరీ నాయుడు సమర్పణలో AG ఫిల్మ్ కంపెనీ, SVS స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. రైటర్, డైరెక్టర్ సాయి మోహన్ ఉబ్బన సినిమాను తెరకెక్కించారు. ఇప్పటి ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ తో.. ఈ ప్రేమకథా చిత్రంలో గోదావరి జిల్లాల అందాలను ఎలా చూపించబోతోన్నారు అనే దానిపై ఓ స్పష్టత వచ్చింది.  ఇక ఈ చిత్రం థియేటర్స్ లో ఎలా అలరిస్తుందో తెలియాలి అంటే వేచి చూడాలి.

కాగా ఈ సినిమాలో రంగస్థలం మహేష్, శ్రీమాన్, జబర్దస్త్ బాబీ, ప్రవీణ్ యండమూరి మరియు దీపక్ ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు.

Also Read: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..

Also Read: Poco M6 5G Vs Poco M6 Pro 5G: తక్కువ ధరలో లభించే ఈ రెండు శక్తివంతమైన మొబైల్స్‌లో ఇదే బెస్ట్‌..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News