Google Layoffs: ప్రపంచంలోని ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ ఆ ఉద్యోగులపై కొరడా ఝులిపించింది. ఏకంగా 43 మందిని ఒక్క వేటుతో పీకిపారేసింది. ఎందుకో కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ ఉద్యోగులు చేసిన పాపం ఒక్కటే..జీతాలు పెంచమని అడగడం. అంతమాత్రానికే పీకేస్తారా అంటే అవును..అదే చేసింది గూగుల్ సంస్థ. ఈ 43 మందిని గూగుల్ కోసం మరో టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ నియమించుకుంది. అంతేకాకుండా ఇదంతా కాగ్నిజెంట్ సంస్థే చేసిందని స్పష్టం చేసింది.
గూగుల్‌కు చెందిన యూట్యూబ్ మ్యూజిక్ కోసం పనిచేసేందుకు కాగ్నిజెంట్ సంస్థ కొంతమంది ఉద్యోగుల్ని నియమించింది. ఆఫీసుకు వచ్చి పనిచేయాలంటే మంచి జీతాలు, అలవెన్సులు, సరళీకృత నిబంధనలుండాలని ఈ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఇది గూగుల్ సంస్థకు ఆగ్రహాన్ని తెప్పించింది. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా కాగ్నిజెంట్ తరపున తన సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన చేరిన 43 మందిని తొలగించేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ యూట్యూబ్ డేటా అనలిస్ట్ జేక్ బెనెడిక్ట్ ఈ విషయంపై అమెరికా ఆస్టిన్ సిటీ కౌన్సిల్‌కు ఆ ఉద్యోగుల తరపున ఫిర్యాదు చేశాడు.
ఈ 43 మంది ఉద్యోగుల్ని యూట్యూబ్ మ్యూజిక్ కోసం గూగుల్-కాగ్నిజెంట్ నియమించుకున్నాయి. ఆఫీసులు వచ్చిన పనిచేయాలంటే మెరుగైన జీతభత్యాలు, ఫ్లెక్సిబుల్ రూల్స్ ఉండాలంటూ డిమాండ్ చేశారు. అయితే గూగుల్ ఈ ఉద్యోగులతో ఎలాంటి చర్చలు జరిపేందుకు గూగుల్ నిరాకరించింది. వీళ్లంతా సంస్థ ఉద్యోగులు కానందున మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పింది. ఇలా హఠాత్తుగా ఉద్యోగాల్నించి తొలగించడం వల్ల చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డబ్బుల్లేక అద్దెలు కట్టుకోలేకపోతున్నారు. ఇది కాస్తా చాలామందిని నిరాశ్రయులుగా మార్చేస్తోంది.
గూగుల్ మాత్రం ఉద్యోగులను తొలగించడం చేయలేదంటోంది. దేశవ్యాప్తంగా వివిధ సంస్థలతో వేర్వేలు ఒప్పందాలున్నాయని, అదే విధంగా కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం సహజంగా ముగిసిందని గూగుల్ తెలిపింది.
Also read: FD Interest Rates: ఎఫ్‌డీ లపై ఏ బ్యాంకు ఎంత వడ్డీ చెల్లిస్తుందో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook