AP EAPCET 2024: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మాస్యుటికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గతంలో ఎంసెట్‌గా పిలిచేవారు. ఏపీఈఏపీసెట్ 2024 నోటిఫికేషన్‌ను కాకినాడ జేఎన్టీయూ విడుదల చేసింది. https://cets.apsche.ap.gov.in/లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.
ఏపీలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కళాశాలల్లో ప్రవేశానికై ప్రతి యేటా నిర్వహించే ఏపీఈఏపీసెట్ పరీక్షను ఈసారి కాకినాడ జేఎన్టీయూ నిర్వహిస్తోంది. ఏప్రిల్ 15 వరకూ అభ్యర్ధుల్నించి దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆ తరువాత ఏప్రిల్ 30 వరకూ 500 రూపాయల జరిమానాతో అప్లై చేసుకోవచ్చు. ఆ తరువాత మే 5 వరకూ 1000 రూపాయల జరిమానా ఉంటుంది. మే 10 వరకూ 5 వేల రూపాయల జరిమానా, మే 12 వరకైతే 10 వేల రూపాయల జరిమానా ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పుల్ని సరిదిద్దుకునేందుకు మే 4 నుంచి మే 6 వరకూ గడువు ఉంటుంది. మే 7వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్, ఎల్బీనగర్ పరీక్షా కేంద్రాలతో పాటు రాష్ట్రంలో 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఏపీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షలు మే 13 నుంచి 16 వరకు జరగనున్నాయి. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు మే 17 నుంచి 19 వరకూ జరుగుతాయి. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల్నించి 12 గంటల వరకూ, తిరిగి మద్యాహ్నం 2.30 గంటల్నించి 5.30 గంటల వరకూ రెండు సెషన్లలో జరుగుతాయి.
Also read: Paytm Services: మార్చ్ 15 తరువాత పేటీఎంలో ఏ సేవలు పనిచేస్తాయి, ఏవి పనిచేయవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook