Litchi Fruit Benefits: వేసవిలో కాలంలో ఎక్కువ డిమాండ్ ఉన్న పండ్లలో లీచీ పండ్లు ఒకటి. లీచీ ఒక ఉపఉష్ణమండల పండు, ఇది చైనాకు చెందినది. ఈ పండు చాలా రుచికరమైనది పోషకాలతో నిండి ఉంటుంది. ఇది చూడడానికి ఎరుపు రంగులో ఉంటుంది. గుండ్రంగా, చిన్న ముళ్ళు ఉండే పొరతో ఉంటుంది. ఇందులో ఎన్నో లాభాలు ఉంటాయి. దీని రుచి పుల్లని, తియ్యనిగా అలాగే పండు జ్యుసి గా ఉండే గుజ్జు ఉంటుంది. ఇందులో బోలెడు పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.
దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలు:
1. జీర్ణక్రియకు సహాయపడుతుంది:
లీచీని తీసుకోవడం వల్ల మలబద్దం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా దొరుకుతుంది. దీని వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.
2. రక్తపోటును నివారిస్తుంది:
లీచీలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది.
3. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
లీచీ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలో విటమిన్ సి దొరుకుతుంది. దీని వల్ల సీజన్‌లో వచ్చే అన్ని సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
4. జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
జుట్టు ఆరోగ్యంగా, దృఢంగా ఉండాలి అంటే మీరు లీచీని తప్పకుండా మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలు తగ్గుతాయి.
5. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
లీచీలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది. అంతేకాకుండా మీ చర్మం ముడతలు, మొటిమలు, నలుపు సమస్యల బారిన పడకుండా సహాయపడుతుంది.
6. క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది:
క్యాన్సర్ నివారణలో లీచీ కీలక ప్రాత పోషిస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను తగ్గిస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.
వినియోగం:
* పచ్చిగా తింటారు
* సలాడ్లలో వేస్తారు
* జ్యూస్ గా తాగుతారు
* ఐస్ క్రీం లో వేస్తారు
లీచీ కొనుగోలు చేసేటప్పుడు:
* ఎరుపు రంగులో లోతుగా ఉండేవి కొనుగోలు చేయాలి
* పండు చాలా గట్టిగా లేదా చాలా మెత్తగా ఉండకూడదు
* ముళ్ళు గట్టిగా ఉండాలి
లీచీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు:
* లీచీ 'చైనీస్ ఆపిల్' అని కూడా పిలుస్తారు.
* లీచీ పండ్లను 'ప్రేమ పండ్లు' అని కూడా పిలుస్తారు.
* లీచీ పండ్లను 'డ్రాగన్ పండ్లు' అని కూడా పిలుస్తారు.
Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్.. పూర్తి వివరాలు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి