Mutton Paya Recipe In Telugu: మటన్ పాయా పూర్వీకుల నుంచి వస్తున్న ఎంతో ప్రత్యేకమైన రెసిపీ. ఈ రెసిపీని నవాబుల కాలం నుంచి ఇప్పటివరకు కొనసాగుతూ వస్తోంది. ఈ రెసిపీని పూర్వీకులు ఎక్కువగా పండగ సమయంలో తయారు చేసుకునేవారు. మటన్ పాయా రెసిపీ ప్రతి వారంలో ఒక రోజైనా తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి ఇందులో లభించి పోషకాలు మోకాళ్లు, కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగించేందుకు సహాయపడతాయి. అయితే ఈ రెసిపీని ఇప్పటి యువత కూడా ఎంతగానో ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొన్ని ప్రత్యేకమైన రెస్టారెంట్లో ఈ మటన్ పాయా రెసిపీ ప్రధాన వంటకంగా కొనసాగుతోంది. చాలామందికి ఈ పాయ రెసిపిని తయారు చేసుకోవడం తెలియక బయట లభించే వివిధ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్లు చేసుకుంటున్నారు. ఇకనుంచి ఇలా ఆర్డర్లు చేసుకోనక్కర్లేదు మీమందించి సులభమైన పద్ధతి ద్వారా ఈ మటన్ పాయా రెసిపీని సులభంగానే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో.. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ పాయ రెసిపీకి కావాల్సిన పదార్థాలు:
❃ 1 కిలో మటన్ పాయ (గొర్రె కాళ్ళు)
❃ 2 ఉల్లిపాయలు, తరిగినవి
❃ 3 టమాటాలు, తరిగినవి
❃ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
❃ 1 టీస్పూన్ పసుపు
❃ 1 టీస్పూన్ మిరపకాయ పొడి
❃ 1 టీస్పూన్ ధనియాల పొడి
❃ 1 టీస్పూన్ గరం మసాలా
❃ 1/2 కప్పు పెరుగు
❃ 1/2 కప్పు కొత్తిమీర, తరిగినది
❃ 1/4 కప్పు పుదీనా, తరిగినది
❃ రుచికి సరిపడా ఉప్పు
❃ నూనె
తయారీ విధానం:
❃ మటన్ పాయా మొక్కలను ఒక బౌల్ లోకి తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మరోసారి పసుపు వేసుకొని శుభ్రం చేసుకోవాలి.
❃ ఆ తర్వాత ఒక గిన్నెలో వాటన్నిటిని వేసుకుని పసుపు, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె కలిపి బాగా మెరినేట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ముక్కలను 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.
❃ ఒక కుక్కర్లో నూనె వేడి చేసి, ఉల్లిపాయలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
❃ ఇలా వేయించిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తప్పకుండా అల్లం పేస్టును పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
❃ ఆ తర్వాత అందులోని టమాటాలు, పసుపు, మిరపకాయ పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మరో 15 నిమిషాల పాటు పక్కన పెట్టాల్సి ఉంటుంది.
❃ ఇలా పక్కన పెట్టిన ముక్కలను కుక్కర్లో వేసి బాగా కలపాల్సి ఉంటుంది.
❃ ఆ తర్వాత 1 కప్పు నీరు పోసి, కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత కుక్కర్ మూతను తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు ఉడికించాలి.
❃ ఇలా చేసిన తర్వాత కుక్కర్ లోని ఆవిరి పోయిన తర్వాత మూత తీసి, పెరుగు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా కలపాలి.
❃ ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి, 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలి. అంతే సులభంగా మటన్ పాయా రెసిపీ తయారైనట్లే.. వేడిగా అన్నంతో పాటు వడ్డించండి.
చిట్కాలు:
❃ మటన్ పాయ నుండి దుర్వాసన రాకుండా ఉండటానికి, ఒక టీస్పూన్ నిమ్మరసం లేదా వెనిగర్ వేసి కడిగితే సరిపోతుంది.
❃ మటన్ పాయ మరింత రుచిగా ఉండాలంటే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించవచ్చు.
❃ కారం ఎక్కువగా ఇష్టపడే వారు, మిరపకాయల పొడి మోతాదును పెంచుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి