Tripti Dimri: యానిమల్ హీరోయిన్ పై మనసు పారేసుకున్న ఆదిపురుష్ నటుడు.. డేట్ చేయాలని ఉందట!

Tripti Dimri Upcoming Movies: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమాల్ సినిమా తర్వాత తృప్తి దిమ్రి పేరు నేషనల్ వైడ్ మారు మ్రోగిపోతోంది. సినిమాలో ఆమెను చూసి ఫిదా అయిపోయిన ప్రేక్షకులలో ఒక బాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు. మరి అతడు ఎవరో ఒకసారి చూద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2024, 11:03 AM IST
Tripti Dimri: యానిమల్ హీరోయిన్ పై మనసు పారేసుకున్న ఆదిపురుష్ నటుడు.. డేట్ చేయాలని ఉందట!

Tripti Dimri: ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో నటించిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్నను పక్కన పెడితే రెండవ హీరోయిన్ గా నటించిన తృప్తి దిమ్రి కెరియర్ మాత్రం ఈ సినిమాతో మారిపోయింది. 

ఈ సినిమాతో అందరి దృష్టి ఈమె మీద పడింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్ అయిపోయింది తృప్తి. కానీ నిజానికి ఇది తృప్తి మొదటి సినిమా కాదు. ఆమె ఎప్పుడో 2017లో పోస్టర్ బాయ్స్ అనే సినిమాతో బాలీవుడ్ లో హీరోయిన్ గా ఈమె అడుగు పెట్టింది. ఆ తర్వాత 2018 లో కూడా లైలా మజ్ను సినిమాలో నటించిన తృప్తి 2020లో బుల్ బుల్ అనే సూపర్ నేచురల్ డ్రామాలో తన నటనతో ఆకట్టుకుంది. 

2022 లో కాలా సినిమాతో కూడా మంచి మార్కులు వేయించుకున్న తృప్తి యానిమల్ సినిమా తో మాత్రం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ తో మారిపోయింది. ఈ సినిమాలో ఆమెను చూసి ఎంతోమంది ప్రేక్షకులు మనసు పారేసుకున్నారు. అందులో ఒక బాలీవుడ్ నటుడు కూడా ఉన్నాడు. అతను మరెవరో కాదు సిద్ధాంత్ కర్ణిక్. 

టీవీ సీరియల్స్ ద్వారా బాగా పాపులర్ అయిన సిద్ధాంత్ కర్ణిక్ యానిమల్ సినిమాలో మొదటి హాఫ్ లో విలన్ పాత్రలో కనిపించారు. తృప్తితో తనకు సీన్స్ లేకపోయినప్పటికీ అతను మాత్రం సినిమాలో ఆమెను చూసి ఫిదా అయిపోయాడట. అంతేకాకుండా నిజజీవితంలో కూడా ఆమెను డేట్ చేయాలని ఉంది అని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు సిద్ధాంత్.

2016లో మేఘ గుప్తా అనే నటిని పెళ్లి చేసుకున్న సిద్ధాంత్ 2020లో విడాకులు తీసుకున్నారు. ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో విభీషణుడి పాత్ర పోషించిన సిద్ధాంత్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించారు. మరో విశేషమేమిటి అంటే ఈ నటుడు యానిమల్ సినిమాలో కూడా ఉన్నాడు. రణబీర్ కపూర్ అక్క భర్త వరుణ్ గా మనకు సిద్ధాంత్ కనిపించి మెప్పించాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో వరుణ్ కి ఎక్కువ రోల్ ఉంది. కాగా యానిమల్ సినిమాలో తృప్తి సెకండ్ హాఫ్ లో మనకు ఎక్కువగా కనిపిస్తుంది.

Also Read: Wine Shops: మందుబాబులకు వెరీ బ్యాడ్‌ న్యూస్‌.. వైన్స్‌, బార్లు, పబ్‌లు బంద్‌

Also Read: KCR: నోరు విప్పిన కేసీఆర్‌.. కవిత, అరవింద్‌, హేమంత్‌ అరెస్ట్‌పై తొలి స్పందన ఇదే..

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News