Hunsa Pidiguddulata: హోలీ వేడుకలను ప్రజలంతా ఎంతో జోష్ గా జరుపుకుంటారు. కొందరు నేచురల్ రంగులతో హోలీ జరుపుకుంటుంటే, మరికొందరు మాత్రం కెమికల్స్ రంగులను వాడి మరీ రంగులతో ముఖానికి పూసుకుంటూ వేడుకలు జరుపుకుంటారు.
హోలీవేడుకల నేపథ్యంలోఅనేక ప్రాంతాలలో వింత వింత ఆచారాలు అమలులో ఉన్నాయి. హోలీరోజున కొన్ని ప్రాంతాలలో కొత్త అల్లుళ్లలను గాడిదల మీద ఊరేగిస్తుంటారు. ఈరోజున కొత్త అల్లుళ్లు గ్రామస్తులకు చిక్కకుండా పారిపోతారు.
ఇక..తెలంగాణలోని నిజామాబాద్ లో హోలీ వేడుకలను మరింత వెరైటీగా జరుపుకుంటారు.సాలూర మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజు సాయంత్రం అనాదీగా పిడిగుద్దులాట కార్యక్రమంను నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్థులంతా రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో,చేతితో ఒకరిపై మరోకరు కొట్టుకుంటూ దాడులు చేసుకుంటారు. దీనిలో చిన్న, పెద్ద తేడాలేకుండా విపరీతంగా కొట్టుకుంటారు.
హున్సాలో జరిగే పిడిగుద్దులాట కార్యక్రమంను చూడటానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ప్రజలకు పెద్ద ఎత్తున వస్తుంటారు. సాయంత్రంపూట ఈ ప్రొగ్రామ్ నిర్వహిస్తారు.
ముఖ్యంగా ఈ కార్యక్రమం పొలీసుల బందోబస్తుల మధ్యన జరుగుతుంది. పిడిగుద్దులాట జరిగేటప్పుడు వీరిపై రంగులను చల్లుతుంటారు. కార్యక్రమంలో గాయపడ్డవారిని తరలించేందుకు ప్రత్యేకంగా అంబులెన్స్ లను కూడా సిద్దంగా ఉంచుతారు.
ఒకప్పుడు హున్సాలో పిడిగుద్దులాట కార్యక్రమం జరపలేదు. ఆ సమయంలో గ్రామంలో నీళ్ల సమస్య వచ్చిందంట. అప్పటి నుంచి గ్రామంలో యథావిధిగా ఎందరు గాయపడ్డ కూడా పిడిగుద్దులాట కార్యక్రమంను నిర్వహిస్తారు.ఈ క్రమంలో ఈసారికూడా పిడిగుద్దులాటకు హున్సాలో గ్రామస్థులు ఏర్పాట్లు చేశారు.