Prithviraj Sukumaran: భాషా బేధం లేకుండా తెలుగు ప్రేక్షకులు అన్ని భాషల సినిమాలని ఆదరిస్తారు. సినిమా కంటెంట్ బాగుంటే భాషతో పని లేకుండా బ్లాక్ బస్టర్ చేసేస్తారు. ఈ నేపథ్యంలోనే చాలా వరకు సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్య మలయాళం సినిమాలు అన్నీ తెలుగులో కూడా విడుదల అవుతున్నాయి.
దాదాపు మలయాళం లో హిట్ అయిన సినిమాలు అన్నీ తెలుగులో కూడా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ఉదాహరణకి ప్రేమలు సినిమా తెలుగులో కూడా చాలా పెద్ద హిట్ అయింది. మలయాళం లో బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన మంజుమ్మల్ బాయ్స్ ఈ మధ్యనే తెలుగులో కూడా విడుదలై మంచి కలెక్షన్లు అందుకుంటుంది.
మమ్ముట్టి నటించిన బ్రహ్మయుగం సినిమా కూడా తెలుగులో ఒక మాదిరిగా బాగానే ఆడిందని చెప్పుకోవచ్చు. మధ్యలో మలయాళం నుంచి ది గోట్ లైఫ్ అనే సినిమా కూడా తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది. ది గోట్ లైఫ్: ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించారు. ట్రైలర్ తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది.
సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చలేకపోయింది. హాలీవుడ్ స్టాండర్డ్స్ ఈ సినిమాలో కనిపించాయి అనడం అతిశయోక్తి కాదు. సినిమా కోసం పృథ్వీరాజ్ ప్రాణం కూడా పెట్టి మరీ పని చేశారు కానీ సినిమాని నేరేషన్ స్లోగా ఉండటం సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు సినిమాతో ఎక్కువగా కనెక్ట్ కాలేకపోయారు.
తెలుగులో ఈ సినిమా రిలీజ్ ఖర్చులు కూడా వెనక్కి రాని పరిస్థితి ఏర్పడింది. కానీ మలయాళం లో మాత్రం ఈ సినిమాకి అనుకోని విధంగా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. పృథ్వీరాజ్ కష్టానికి తగ్గ ఫలితం లభించింది. విడుదలైన మొదటి రోజు నుంచి సినిమా థియేటర్లను హౌస్ ఫుల్ చేస్తూ విజయవంతంగా రన్ అవుతుంది.
మలయాళం ఇండస్ట్రీలోనే వేగంగా 100 కోట్ల వసూళ్లను సాధించిన సినిమాగా ఈ చిత్రం నిలవడం విశేషం. ఆర్ట్ సినిమా లాగా ఉండే ఈ సినిమాను ఇంత అద్భుతమైన హిట్ చేసి మంచి సినిమాలను ఆదరించడంలో తాము కూడా ఏం తక్కువ కాదు అని మలయాళం ప్రేక్షకులు మరొకసారి నిరూపించుకున్నారు.
Also Read: KCR Arrest: కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Also Read: Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook