ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా మధ్యప్రదేశ్ లో కూడా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో భాగంగా బీజేపీ,కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో శివపురి ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సినీనటి, కాంగ్రెస్ మహిళా నేత నగ్మ అక్కడి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో ఆమె స్పీచ్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
నగ్మా ప్రసంగాన్ని వినేందుకు ఆత్రుతతో అక్కడ స్పల్పతోపు లాట జరిగింది. ఆమెను దగ్గర నుంచి చూసేందుకు అభిమానులు ముందుకు తోసుకువచ్చారు. ఈ క్రమంలో పలువురు కార్యకర్తలు ఒకరిపై మరోకరు ముష్ఠి యుద్ధం చేసుకున్నారు. నగ్మ స్వయంగా సర్ధిచెప్పడంతో వివాదం సర్దుమణిగింది. అనంతరం ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు
మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సినీనటి నగ్మా కాంగ్రెస్ పార్టీ తరుఫున స్టార్ క్యాంపైనర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆమె శివపురితో పాటు గ్వాలియర్, కరెరా తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గత ఎన్నికల ప్రచారంలో కూడా నగ్మా ప్రచారంలో నిర్వహించారు. అప్పుడు కూడా ఆమెకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తాజా మరోసారి తోపులాట జరగడం గమనార్హం