Health Benefits Of Sorghum: తృణధాన్యాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అయితే తృణధాన్యాల్లో జొన్నలకు ప్రసిద్ధ స్థానం ఉంది. దీంతో చాలా మంది జొన్న రొట్టెలను తయారు చేసుకొని తింటారు. షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇవి అమూల్యమైన పదార్థం. గోధుమ రొట్టెలతో పోల్చితే ఈ జొన్నలకు అనేక పోషకాలు ఉంటాయి.
ఈ జొన్నలతో మీరు అధిక రక్తపోటు సమస్యలను, బీపీ, అల్సర్, మలబద్ధం వంటి ఇతర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జొన్నలు ఎక్కువగా ఆఫ్రికాలో అధికంగా పండుతాయి. జొన్నలతో మీరు జొన్న పిండిని కూడా తయారు చేసుకోవచ్చు. జొన్నలతో తయారు చేసిన ఆహార పదార్థాల పిల్లలకు తప్పకుండా ఇవ్వడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. దీని వల్ల మెరుగైన జీర్ణక్రియ, ఆరోగ్యవంతమైన గుండె, బరువుని అదుపులో ఉంచేందుకు ఇవి ఉపయోగపడతాయి.
జొన్నల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల తెలుసుకుందాం.
జొన్నలలో ప్రొటీన్, ఫైబర్, భాస్వరం, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ సమ్మేళనాల వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా దొరుకుతాయి. ఈ పోషకాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పేగుల కదలికలను మెరుగుపరచడంలో కూడా కీలక ప్రాత పోషిస్తూంది. ఫైబర్ గట్ బ్యాక్టీరియాను అభివృద్థి పెంచుతుంది. జొన్నలతో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. షుగుర్, బీపీ ని కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. వీటిని భోజనంలో చేర్చుకోవడం వల్ల గ్లూకోజ్‌లో వచ్చే స్పైక్‌లు, క్రాష్లను తగ్గించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను నియంత్రించడంలో కూడా ఎంతో సాయపడుతుంది. జొన్నలో ఉండే ఫినోలిక్ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. జొన్నలతో తయారు చేసిన రొట్టెలను తినడం వల్ల అధిక బరువు సమస్య ఉన్నవారు తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. ఇందులోని అధిక ఫైబర్, ప్రొటీన్లు ఉండటం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడుతాయి.
జొన్న రొట్టెకి కావల్సిన పదార్థాలు:
జొన్న పిండి- ఒక కప్పు
నీళ్లు - పిండికి కావాల్సినంత
ఉప్పు- కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా ఒక గిన్నెలో జొన్న పిండిని తీసుకోవాలి. అందులో కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు కలుపుకోవాలి. తరువాత పిండిపై మూత పెట్టి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలని చెబుతున్నారు. పది నిమిషాల తరువాత చేతిని తడి చేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు వత్తుకోవాలి. తరువాత పిండిని చపాతీ ముద్దలుగా చేసుకోవాలి. పిండిలో ఒక్కో ఉండను తీసుకొని వత్తుకొవాలి. చపాతీ కర్రతో రొట్టెలను తయారు చేసుకోవాలి. స్టవ్ మీద పెన్నాన్ని ఉండి వేడి చేసుకోవాలి. తరువాత జొన్న రొట్టెను వేసి తడితో రెండు వైపుల కాచ్చుకోవాలి. వెజ్, నాన్ వెజ్ కూరలతో ఈ జొన్న రొట్టెను కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి