Dada Saheb Phalke Film Festival 2024: 'మా ఊరి పొలిమేర 2'లో లక్ష్మీ అనే పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించారు హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల. ఈ సినిమాలో నటనకు ఆమె 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. ఇటీవల న్యూఢిల్లీలో అవార్డుల వేడుక ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. తనకు ఉత్తమ నటి అవార్డు రావడంపై కామాక్షి భాస్కర్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన మూవీ యూనిట్‌కు ధన్యవాదాలను తెలిపారు. గతేడాది రిలీజ్ అయిన ‘మా ఊరి పొలిమేర 2’ మంచి విజయం అందుకుంది. అనిల్ విశ్వనాథ్ రూపొందిన ఈ మూవీ.. ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎంపిక కావటం విశేషం.
బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు రావడంపై కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. తనకు ఉత్తమ నటిగా అవార్డు రావటం థ్రిల్లింగ్‌గా అనిపించిందని చెప్పారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన జ్యూరీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. సమహార థియేటర్‌లో తనకు యాక్టింగ్ నేర్పించిన తన గురువు రత్న శేఖర్‌కి, నీజర్ కబికి ధన్యవాదాలు తెలిపారు. తనపై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన ఆడియన్స్‌కు థాంక్స్ చెప్పారు. తనకు సపోర్ట్ చేసి.. ఈ అవార్డు రావటానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ అంకితమిస్తున్నానని పేర్కొన్నారు.
మా ఊరి పొలిమేర 2 మూవీలో తన పాత్ర గురించి చెబుతూ.. ముందు నుంచి సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం తమ ఉండేదని.. అయితే అవార్డులు వస్తాయని తాము ఊహించలేదన్నారు. మొత్తం టీమ్ ఇచ్చిన సపోర్ట్‌తోనే అవార్డులు సొంతం చేసుకుందన్నారు. ఓ జట్టుగా తాము ఇంతవరకు ప్రయాణంతో పాటు ఇతర భాషా ప్రేమికులు సినిమా కంటెంట్‌ను ఎలా ఆదరిస్తున్నారో చూడటం ఆనందంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ సినిమా మంచి వసూళ్లను సాధించటమే కాకుండా ఆడియన్స్, విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుందన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు తన మనసులోప్రత్యేకంగా నిలిచిపోతుందని చెప్పారు కామాక్షి భాస్కర్ల.
అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మా ఊరి పొలిమేర 2 చిత్రాన్ని శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌర్ కృష్ణ నిర్మించారు. గ్యాని మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశారు. సత్యం రాజేశ్, కామాక్షి భాస్కర్ల హీరోహీరోయిన్స్‌గా యాక్ట్ చేయగా.. బాలాదిత్య, చిత్రం శీను, రవివర్మ, రాకేందు మౌళి, సాహితీ దాసరి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter