Fake Video Case: ఫేక్ వీడియో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణకు రాలేమని.. కొన్ని రోజుల తర్వాత ఆగి వస్తామని విన్నవించిన మరుసటి రోజే అరెస్ట్‌లు కొనసాగడం కలకలం రేపింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసు దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫేక్ వీడియో లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండడంతో బీజేపీ ఈ కేసును తీవ్రంగా పరిగణించింది.
Also Read: KCR Ban: కేసీఆర్‌కు ఎన్నికల సంఘం ఝలక్.. 48 గంటల పాటు ప్రచారం నిషేధం
విచారణ కోసం మరోసారి ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన అక్కడి పోలీసులు కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ చేరుకున్నారు. బీజేపీ నాయకుడు ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మన్నె సతీశ్, నరేశ్, రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను నిర్వహిస్తుంటారు. ఢిల్లీ పోలీసులు నోటీసులు అందుకున్న వారిలో రేవంత్ రెడ్డితోపాటు మన్నె సతీశ్, నరేశ్, తస్లీమా ఉన్నారు. ను తాజాగా అరెస్ట్ చేశారు. అయితే వీరి అరెస్ట్‌కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: KTR Challenge: 'లంగలకు పెత్తనం ఇస్తే నెత్తి మీద పెత్తనం చేస్తారు' మోదీ, రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు అమిత్ షా వీడియోను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్లు, రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులకు ముందే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter