Foods To Control Blood Pressure: ఆధునిక జీవనశైలిలో మారిన ఆహారం అలవాట్ల కారణంగా చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్, అధిక రక్తపోటు, అధిక బరువు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు ఆహారం పట్ల ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
అయితే ఎలాంటి ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అనేది మనం తెలుసుకుందాం.
సాధారణ రక్తపోటు 120/80 mmHg కంటే తక్కువగా ఉంటుంది. దీనికి మించి ఎక్కువగా ఉంటే అంటే 40/90 mmHg లేదా అంతకంటే ఎక్కువగా ఉండే రక్తపోటు. తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) అనేది 90/60 mmHg కంటే తక్కువగా ఉండే రక్తపోటు. అయితే అధిక రక్తపోటు ఎక్కువగా ఉండటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు చికిత్స చేయకపోతే, అది గుండె జబ్బులు, స్ట్రోక్, వృక్క వ్యాధి ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
అధిక రక్తపోటు తగ్గించుకోవాలి అనుకొనేవారు ఉఈవనశైలిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అవి
ప్రతిరోజు వాకింగ్ చేయడం, లేదా వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. దీని వల్ల ఆరోగ్యకరమైన బరువు ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. పండ్లు, కూరగాయాలు, తృణధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అతిగా వేయించి నూనె పదార్ధాలు, కొవ్వు కలిగిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన పదార్ధాలు తీసుకోకుడా ఉండాల్సి ఉంటుంది. అలగే మందు, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటు కొన్ని ఆహారపదార్థాలు బీపీని అదుపు ఉంచుతాయి.
బీపీ అదుపులో ఉంచడానికి పచ్చిగా తినాల్సిన కూరగాయలు:
1. పాలకూర:
పాలకూర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, ఫోలేట్లు ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. పాలకూరలోని నైట్రేట్లు రక్తనాళాలను విస్తరించి రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
2. బీట్రూట్:
బీట్రూట్లో నైట్రేట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇందులోని ఫైబర్ జీర్ణక్రియకు మంచిది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
3. సొరకాయ:
సొరకాయలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
4. వెల్లుల్లి:
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లి రక్తాన్ని పలుచగా చేయడంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
5. టమోటాలు:
టమోటాలు లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. టమోటాలు రక్తపోటును తగ్గించడంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి.
గమనిక: ఈ కూరగాయలను పచ్చిగా తినడం వల్ల మాత్రమే రక్తపోటును నియంత్రించలేము. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వైద్యుడి సలహా పాటించడం కూడా ముఖ్యం.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి