Pawan Kalyan: జీ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీ తెలుగు సీఈవో కమ్ ఛీఫ్ ఎడిటర్ భరత్ అడిగిన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ ఎంతో ఇంట్రెస్టింగ్ సమాధానాలు ఇచ్చారు. గత మూడు ఎన్నికలకు ఈ ఎన్నికలు ఈ ఎలక్షన్స్‌కు తేడా ఏమి కనిపిస్తుందనే ప్రశ్నకు.. పవన్ కళ్యాణ్ అనుభవం అంటూ ఆసక్తికర సమాధానమిచ్చారు. ఓటమి తనకు ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు. గత 2019లో జరిగిన ఎన్నికల్లో తాను గాజువాక, భీమవరం నుంచి రెండు చోట్ల ఓడిపోయాను. అపుడు తాను తన కుమారుడికి టీ గ్లాసు పట్టుకొని పాలు తాగిస్తూ ఉన్నపుడు తన భార్య నా మూడ్ అపుడు ఎలా ఉందో క్యాప్చర్ చేసింది. ఓటమి అంటే భయం లేదు. ఓటమితో మనిషి తాలుకూ నిజ స్వరూపాలు బయటకు వస్తాయి. గతంలో తనతో ఉన్నవాళ్లు.. ఓడిపోయిన తర్వాత తనతో ఎలా బిహేవ్ చేసారు. ఎవరు తనవాళ్లు.. ఎవరు పరాయివాళ్లనేది ఓటమి అనేది నేర్పిస్తుందన్నారు. అధికారం ఇస్తే మనిషి తాలూకు నిజ స్వరూపాలు బయటకు వస్తాయనే విషయాన్ని ప్రస్తావించారు.
ఓటమి అనేది నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. నాకు జీవితంలో గెలుపు కంటే ఓటమిలే ఎక్కువగా ఉన్నాయి. ఫెయిలైన ప్రతీసారి అంతకంటే మెరుగ్గా పనిచేయాలనే కసి నాలో ఏర్పడింది. ఈ సందర్బంగా పలు ఉదాహరణలు ప్రస్తావించారు. గత ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి ఓడిపోయినా.. తనకు 6 నుంచి 7 శాతం ఓట్లు వచ్చాయి. అంటే ఇంత మంది ప్రజల్లో తనకు ఆదరణ ఉందన్న విషయాన్ని ఎన్నికల్లో గత ఓటమి గుర్తు చేసిందన్నారు. అంతేకాదు ఓటమి వల్ల బీ ఫారం ఇచ్చే సత్తా వచ్చింది. ఫెల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టూ సక్సెస్ అనే విషయం తన విషయంలో ప్రూవ్ అయిందన్నారు.
ఇదీ చదవండి: అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter