Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీలో నేను లేను.. నన్ను లాగొద్దు: జానీ మాస్టర్‌

Jani Master Comments About Bangalore Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీ తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతుండగా.. తాజాగా జానీ మాస్టర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రచారాన్ని జానీ మాస్టర్‌ ఖండించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : May 20, 2024, 06:22 PM IST
Rave Party: బెంగళూరు రేవ్‌ పార్టీలో నేను లేను.. నన్ను లాగొద్దు: జానీ మాస్టర్‌

Jani Master: తెలుగు సినీ పరిశ్రమలో బెంగళూరు రేవ్‌ పార్టీ కలకలం రేపుతోంది. పలువురు ప్రముఖులు పట్టుబడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పలానా వ్యక్తులు పాల్గొన్నారని సినీ ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. కొందరు అత్యుత్సాహంతో ఇష్టమొచ్చిన పేర్లు చెబుతున్నారు. సంబంధం లేని వారిని కూడా లాగుతున్నారు. ఇప్పటికే సినీ నటీనటులు హేమ, శ్రీకాంత్‌ తదితరుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. తాజాగా కొరియోగ్రాఫర్‌, జనసేన పార్టీ నాయకుడు జానీ మాస్టర్‌ పేరు బయటకు వచ్చింది. ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అనూహ్యంగా తన పేరు బయటకు రావడంపై జానీ మాస్టర్‌ విస్మయం వ్యక్తం చేశాడు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఈ సందర్భంగా ట్విటర్‌ (ఎక్స్‌) లో జానీ మాస్టర్‌ ఓ పోస్టు చేశారు.

Also Read: Kovai Sarala: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పెళ్లి చేసుకుంటా: బ్రహ్మానందం హీరోయిన్‌

 

'నా గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసే మొదటి విషయం నాకు అటువంటి అలవాట్లు లేవని. అనవసరంగా నాపై, మా జనసేనాని (పవన్‌ కల్యాణ్‌)పై బురద జల్లే ప్రయత్నం ఇది. ఇలా తప్పుడు ప్రచారాలు చేసే గుంట నక్కల ఏడుపులు తొందర్లోనే వింటాం. ఈ పుకార్ల వెనక నిజాలు తెలుసుకోకుండా నమ్మేసి నోటికొచ్చినట్టు మాట్లాడేస్తున్న, షేర్ చేస్తున్న వారి మనస్థితిపై జాలేస్తుంది' అని జానీ మాస్టర్‌ 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

Also Read: Kavtiha: కల్వకుంట్ల కవితకు మళ్లీ నిరాశే! కానీ ఇక్కడే భారీ ట్విస్ట్‌.. ఏం జరిగిందంటే?

బెంగళూరు రేవ్‌ పార్టీలో పట్టుబడిన వారిలో పవన్‌ కల్యాణ్‌కు సన్నిహితులు ఉన్నారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. కొన్ని ఫొటోలు కూడా పెడుతూ కొందరు పోస్టులు చేశారు. వాటిని చూసిన జానీ మాస్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోస్టులు చేసిన వారివి స్క్రీన్‌ షాట్లు తీసుకుని షేర్‌ చేశారు. ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. ఎన్నికల ఫలితాల అనంతరం తనపై దుష్ప్రచారం చేసిన వారి పని ఉంటుందని ప్రకటించారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News