Chinmayi Sripada: చిన్మయి తన సోషల్ మీడియాలో సినిమాల గురించి కన్నా ఎక్కువ సోషల్ కాసెస్ గురించే మాట్లాడుతూ ఉంటుంది. కొంతమంది ఈమని ఫెమినిస్ట్ అన్న.. మరి కొంతమంది ఈమె మాట్లాడేదానిలో నిజం ఉంది కదా.. అంటూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం చిన్మయి సోషల్ మీడియాలో ఒక వైరల్ వీడియో వల్ల బలైన ఒక తల్లి గురించి.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది
అసలు విషయానికి వస్తే నేటిజన్లు ట్రొల్స్ కు ఒక తల్లి బలయింది. సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. తమిళనాడు కోయంబత్తూర్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ మధ్య చెన్నైలోని ఒక అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి కింద పడుతున్న చంటి బిడ్డను.. స్థానికులు కాపాడిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అయితే ఈ వీడియో వైరల్ అయిన తరువాత ఆ బిడ్డ తల్లిని తప్పుపడుతూ.. అసలు ఆమె అలా ఆ బిడ్డని ఎలా వదిలేసింది అంటూ.. సోషల్ మీడియాలో నెటిజెన్స్ తీవ్రస్థాయిలో ట్రొల్ చేశారు. వాళ్లు చేస్తున్న కామెంట్లకు.. మనస్థాపానికి చెందిన ఆమె ఆదివారం బలవస్మరణానికి పాల్పడింది.
కోయంబత్తూర్ లోని కరమదైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రమ్య భర్తతో కలిసి చెన్నైలో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉండేది. కాగా ఏప్రిల్ 28న రమ్య తన ఎనిమిది నెలల బిడ్డను ఎత్తుకొని బాల్కనీలో అన్నం తినిపిస్తుండగా.. అకస్మాత్తుగా ఆ పాప తల్లి చేతిలో నుంచి జారీ.. ఫస్ట్ ఫ్లోర్ లోని రేకుల పైన పడిపోయిందో. ఈ విషయాన్ని గమనించిన పొరుగువారు.. ఆ పాపని కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. చిన్నారిని కాపాడిన వాళ్ళను ఇంటర్వ్యూలు కూడా చేశారు. ఆ పాపని కాపాడిన వాళ్ళని మెచ్చుకుంటూ.. న్యూస్ ఛానల్ అంతా వార్తలు వేశాయి. అయితే అనంతరం తల్లి నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందంటూ ఈ వీడియో కింద అందరూ కామెంట్స్ పెట్టసాగారు. జాగ్రత్తగా చూసుకోలేని తల్లిదండ్రులు అసలు పిల్లల్ని కనకూడదు అంటూ.. ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతూ వచ్చారు. దీంతో డిప్రెషన్ కి గురైన రమ్య తన తల్లి గారి ఇంటికి వెళ్లిపోయి అక్కడ ఆదివారం.. ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని సమాచారం
ఇంటికి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు.. ఆమెను చూసి వెంటనే హాస్పిటల్ కి తరలించగా అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా సోషల్ మీడియా ట్రోల్స్ కామెంట్లతోనే రమ్య మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు మీడియాకి వెల్లడించారు. తాజాగా ఈ ఘటనపై సింగర్ చిన్మయి తీవ్ర విచారం వ్యక్తం చేసింది మీ ట్రొల్స్ వల్లే చిన్నారి తల్లి చనిపోయింది. ఇప్పుడు మీ అందరికీ హ్యాపీగా ఉందా ..అదే రేప్ చేసే వాళ్ళపైన ఇంత ఇదిగా ఎందుకు వీరు రియాక్ట్ అవ్వరు.. అంటూ తన ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్లు కొని మరి.. హత్య, రేప్ చేసిన వాళ్ల పర్ఫామెన్స్ లు చూస్తారు.. ఎవరైతే ఆమెని ట్రోల్ చేశారో ఇప్పుడు వాళ్లే ఆ పాపని వచ్చి చూసుకోండి అంటూ ఎమోషనల్ అయింది.
Also Read: Shyam Rangeela: ప్రధాని మోదీపై పోటీకి దిగిన హాస్య నటుడికి దిమ్మతిరిగే షాక్
Also Read: Mamata Banerjee: మరో బాంబ్ పేల్చిన మమతా బెనర్జీ.. ఇండియా కూటమికి రాం రాం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter