Habits of intelligent people: ఎక్కువ శాతం ఇంటలిజెన్స్ ఉన్న వ్యక్తులు కొత్త కొత్త వ్యవహారాలను కొత్త అప్డేటెడ్ టెక్నాలజీని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీరు కూడా ఇంటలిజెంట్ వ్యక్తుల్లో భాగం కావాలి అంటే కొన్ని లక్షణాలు మీలో ఉండాలి. కొన్ని అలవాట్లను మీరు చేర్చుకోవాలి అవేంటో తెలుసుకుందాం.
తరచూ చదవడం..
ఇంటెలిజెంట్ వ్యక్తులు పుస్తకాలు ఎక్కువగా చదువుతారు. ప్రతిదీ చదవడం వల్ల మైండ్ ఆలోచించే శక్తిని ఎక్కువగా పొందుతుంది. రకరకాల బుక్కులను చదవడం లైఫ్ లో భాగం చేసుకోవాలి. దీంతో ఒకాబులరీ పెరగడంతో పాటు మనకు ఆలోచన తత్వం కూడా అలవాటు పడుతుంది.
సోషల్ ఇంటరాక్షన్..
ఇంటెలిజెంట్ వ్యక్తులు ఎక్కువ శాతం సర్కిల్ మెయింటెన్ చేసి వాళ్లతో మాట్లాడుతుంటారు. కొత్త కొత్త విషయాలను ఇతరులతో డిస్కషన్ తీసుకువస్తారు. నాలెడ్జ్ కలిగిన వ్యక్తులతోనే వీళ్లు మాట్లాడుతుంటారు. దీంతో వీళ్ళు కూడా ఇంటలిజెన్స్ మెరుగు పరచుకుంటారు.
సక్సెస్..
ఇంటెలిజెంట్ వ్యక్తులు విజయం సాధించిన, లైఫ్ లో ఫెయిల్యూర్స్ ఉన్న అది ఒక గుణపాఠంలో తీసుకుంటారు. ఇలా ఇంటెలిజెంట్ వ్యక్తులు వీటిని గుణపాఠంగా తీసుకొని కొత్త అవకాశాలకు ప్రయత్నిస్తుంటారు. మళ్లీ సక్సెస్ సాధించే వరకు వదలరు. అవి మీలో కూడా అలవరచుకుంటే మీరే కింగ్.
ఇదీ చదవండి: మీ జుట్టు 5 అడుగుల పొడవు కావాలంటే ఈ 5 తినండి.. నెలలోనే బెస్ట్ రిజల్ట్స్
టీచింగ్ స్కిల్..
కొత్త విషయాలను ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల మన ఆ మెదడు ఆలోచన తీరు మరింత మెరుగ్గా పనిచేస్తుంది. తెలియని వారికి చెప్పడం వల్ల మనకు కూడా లోతుగా ఆ అంశంపై అవగాహన పెరుగుతుంది. అందుకే వీరు ఇతరులకు తమ నాలెడ్జిని కూడా షేర్ చేస్తూ ఉంటారు.
అర్థం చేసుకునే విధానం..
ఇంటెలిజెంట్ వ్యక్తులు కొత్త విషయాలు రకరకాలుగా తెలుసుకుంటారు. విజువల్ ,ఆడిటరీ వాళ్లకి ఏది బెస్ట్ గా వర్క్ అవుట్ అవుతుందో దాన్ని ఫాలో అవుతారు. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏ కాన్సెప్ట్ తో ఎక్కువగా ఇంటెలిజెన్స్ పెరుగుతుందో దానిపై ఎక్కువ ఫోకస్ చేస్తారు.
అప్డేటెడ్..
ఇంటెలిజెంట్ వ్యక్తులు మార్కెట్లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న విషయాలను ఉత్పత్తులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. కరెంటు ఈవెంట్స్, ట్రెండ్ డెవలప్మెంట్స్ తెలుసుకోవడంలో ఆసక్తి కలిగి ఉంటారు.
ఇదీ చదవండి: మీ ముఖానికి ఫేస్ టోనర్ ఉపయోగిస్తే చాలు.. రెట్టింపు గ్లోయింగ్ స్కిన్ మీసొంతం..
ఉత్సాహం..
ఇంటలిజెంట్ గా ఉండే వ్యక్తులు ఎక్కువగా ఇతరుల కంటే ఉత్సాహంగా కనిపిస్తారు ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు వాళ్ళు తెలుసుకోవాలని తత్వం వాళ్ళలో ఎక్కువగా ఉండడం వర్క్ షాప్ లకు అటెండ్ అవడం వంటివి చేస్తూ ఉంటారు.
మైండ్ ఫుల్ యాక్టివిటీస్..
ఇంటెలిజెన్సీ పెరగాలంటే మీరు కూడా మైండ్ ఫుల్ యాక్టివిటీస్ లో భాగం కావాలి అంటే మెదడు ఆరోగ్యానికి యోగ వంటివి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
8 Habits of Smart People: ఈ 8 లక్షణాలు మీలో ఉంటే.. మీరు ఇంటలిజెంట్ అయి ఉంటారు..