AP Election Counting 2024: దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికలు, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఆ తరువాత అంటే 8.30 గంటల్నించి ఈవీఎంలను లెక్కిస్తారు.
దేశమంతా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా చూస్తోంది. అధికార పార్టీ ఓ వైపు, తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమిగా మరోవైపు తలపడిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా మిశ్రమంగా ఉండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఏదేమైనా మద్యాహ్నం 12 గంటలయ్యేసరికి ఏపీ ఫలితాలపై క్లారిటీ రావచ్చు. మొత్తం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే సారికి సాయంత్రం కావచ్చు. ఏపీలో 3.33 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో 4.61 లక్షలమంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓట్లు వేశారు. 26,473 మంది ఓట్ ఫ్రం హోం చేశారు. ఇక త్రివిధ దళాల్లో పనిచేసే సిబ్బంది ఈవీఎం విధానంలో ఓట్లేశారు.
రాష్ట్రంలో అత్యల్పంగా కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ 13 రౌండ్లలో ముగియనుంది. అత్యధికంగా 29 రౌండ్లు కూడా ఉన్నాయి. ఎక్కడా ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను చిత్రీకరించేందుకు మీడియాకు అనుమతిచ్చారు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 119 మంది అబ్జర్వర్లను ఎన్నికల సంఘం నియమించింది.
అమలాపురం, భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితం వచ్చేటప్పటికి ఆలస్యం కావచ్చు. దేశవ్యాప్తంగా 1.5 కోట్లమంది ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు.
Also read: YS Jagan Viral Tweet: ఎన్నికల ఫలితాల ముందు సీఎం వైఎస్ జగన్ సంచలన ట్వీట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook