Saturn Retrograde 2024: జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఈ రాశుల వారికి లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

Saturn Retrograde 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూన్ 30వ తేదీన శని గ్రహం కుంభరాశిలో వ్యతిరేక దిశలో తిరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ ఐదు నెలల పాటు లాభాలు పొందబోయే రాశుల వారెవరో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 9, 2024, 09:10 AM IST
 Saturn Retrograde 2024: జూన్ 30 నుంచి నవంబర్ 15 వరకు ఈ రాశుల వారికి లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

 

Saturn Retrograde 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడిని కర్మలకు అధిపతిగా పిలుస్తారు. ఎందుకంటే ఈ శని దేవుడు వ్యక్తి కర్మలను బట్టి ఫలితాలను అందిస్తాడు. నిజజీవితంలో వ్యక్తులు మంచి పనులు చేస్తే శుభ ఫలితాలను అందిస్తాడు. అదే ఈ వ్యక్తులు చెడు పనులు చేస్తే అనేక దుష్ప్రభావాలను కలిగిస్తాడని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అందుకే శని దేవుడికి, గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇదిలా ఉంటే శని గ్రహం ప్రత్యక్ష చలనం చేయబోతోంది. ఇది జూన్ 30వ తేదీ నుంచి జరగబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని గ్రహం జూన్ 30వ తేదీ నుంచి వ్యతిరేక దిశలో కదలడం ప్రారంభిస్తాడని, ఇది నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇలా శని గ్రహం వ్యతిరేక దిశలో తిరగడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ముఖ్యంగా శని గ్రహం సుభస్థానంలో ఉన్న రాశుల వారికి ఈ సమయంలో అంటే నవంబర్ 15వ తేదీ వరకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. అయితే ఏయే రాశి వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.

తులారాశి: 
తులా రాశి వారికి రాబోయే ఐదు నెలల అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరు ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అలాగే ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. సమాజంలో స్థానంతో పాటు హోదా కూడా పెరుగుతుంది. దీంతోపాటు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా మంచిది. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు పెట్టుబడులు పెట్టడం వల్ల అద్భుతమైన లాభాలను పొందగలుగుతారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులను కూడా చాలా వరకు మెరుగుపడతాయి. కష్టాలన్నీ తొలగిపోయి ఈ సమయంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు సూచిస్తున్నారు.

వృశ్చిక రాశి: 
కుంభరాశిలో శని గ్రహం ఐదు నెలల పాటు వ్యతిరేక దిశలో తిరగడం కారణంగా వృశ్చిక రాశి వారికి విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం వల్ల భవిష్యత్తులో అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. దీంతోపాటు ఊహించని ధన లాభాలు కూడా పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నాను. అలాగే ప్రేమ జీవితం కొనసాగిస్తున్న వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక కెరీర్‌కు సంబంధించిన విషయాల్లోకి వెళితే.. ఈ సమయంలో అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా ఎప్పటినుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది దీని కారణంగా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు పొంది ఉద్యోగాల్లో సెటిల్ అవుతారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా బలవంతులు అవుతారు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

కన్యారాశి: 
కన్యా రాశి వారికి కూడా రాబోయే ఐదు నెలల పాటు వ్యక్తిగత జీవితం చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారికి సానుకూల మార్పులు రావడమే కాకుండా ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. అయితే వీరు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కొట్టి అనారోగ్య సమస్యలు రావచ్చు. దీంతో పాటు ఎలాంటి పనులు చేసిన మంచి శుభవార్తలు వింటారు అలాగే విహారయాత్రలకు కూడా వెళ్తారు. ఇక ఈ రాశి వారు శని అనుగ్రహం పొంది ఆర్థికంగా అనేక లాభాలు పొందగలుగుతారు. అలాగే వీరికి అదృష్టం కూడా పెరిగి ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధించగలుగుతారు. ఎప్పటినుంచో అనుకున్న పనులు కూడా ఈ సమయంలో జరుగుతాయి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News