Tomato rates: కొన్నిరోజులుగా టమాటా ధరలు మండిపోతున్నాయి. వాతావరణ ప్రభావాలు డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడం వల్ల టమాటా ధరలు కేజీ వందరూపాయలను దాటేసినట్లు తెస్తోంది.
టమాటా ధరలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. రెండు వారాల క్రితం మార్కెట్ లో.. కేజీ టమాటాలు 40-60 వరకు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సప్లై తగ్గిపోవడం వల్ల ప్రస్తుతం వీటి ధర సెంచరీని దాటేసింది. చాలా చోట్ల టమాటా ధరలు ఇప్పుడు కేజీకి వందరూపాయలుగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నిత్యావసరల సరుకులు ఒకవైపు, కూరగాయాల ధరలు కూడా పెరుగుతుండటంతో సామాన్యులు బెంబెలెత్తిపోతున్నారు. సగటు మనిషి ప్రతిరోజు టమాటాలు, ఉల్లిపాయలను ప్రతి ఒక్కరు ఉపయోగిస్తుంటారు. టమాటాలతో ఏ పదార్థమైన వండటం తొందరగా అవుతుంది.
ఇక పిల్లలు కూడా టమాటాచట్నీ, కూరగాయలను ఎంతొ ఇష్టంగా తింటారు. అందుకే ఎక్కువ మంది టమాటాలను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక మహరాష్ట్రతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే టమాటాల సప్లై ఆగిపోయినట్లు తెలుస్తోంది.
మారిన వాతావరణ పరిస్థితుల వల్ల చాలా వరకు టమాటాలో పాడైపోయినట్లు సమాచారం. ఇక మనదగ్గర పొలాల్లో నాటిన టమాటాలు చేతికి రావడానికి మరో రెండు నెలల సమయం పడుతుంది. అప్పటి వరకు ఇలాంటి పరిస్థితులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు ఉల్లిపాయలు కూడా అందరిని కన్నీళ్లు పెట్టిస్తుంది. కేజీ ఉల్లిధరలు కూడా వంద రూపాయలకు చేరువయ్యింది. ఇప్పటికు చాలా హోటల్స్, రెస్టారెంట్ లలో ఉల్లి పాయలు లేవని కూడా పబ్లిక్ గా బోర్డులు సైతం పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రజలకు మాత్రం ఇది వరుస షాక్ లుగా చెప్పుకొవచ్చు.
టమాటాలు, ఉల్లి పాయలు లేకుండా చాలా వరకు ఏ వంట కూడా చేయడం సాధ్యపడదు. ఇవి రెండు ఉంటే ఏరకపు వంట అయిన సులువుగా, టెస్టీగా చేయడానికి కుదురుతుంది. అందుకే టమాటాలు, ఉల్లిపాయల దిగుమతిపై ప్రభుత్వాలు చర్యలు తీసుకొవాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.