Yoga For Constipation: ఈ 4 ఆసనాలు వేస్తే మలబద్ధకం మందుల్లేకుండానే మాయం

Yoga For Constipation: ఇటీవలి కాలంలో మల బద్ధకం సమస్య తీవ్రమౌతోంది. చాలామందిలో ఈ సమస్య కన్పిస్తోంది. ఆధునిక జీవన శైలి, వివిధ రకాల చెడు ఆహారపు అలవాట్లు ఇందుకు కారణం. మరి ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 19, 2024, 06:29 PM IST
Yoga For Constipation: ఈ 4 ఆసనాలు వేస్తే మలబద్ధకం మందుల్లేకుండానే మాయం

Yoga For Constipation: ఆధునిక బిజీ ప్రపంచంలో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి సక్రమంగా లేకపోవడంతో చాలా రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. వీటిలో అత్యంత కీలకమైంది మలబద్ధకం సమస్య. పైకి కన్పించేంత సులభమైన సమస్య కాదిది. అందుకే ఈ సమస్య పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. 

సర్వ వ్యాధులకు మూలం కడుపు నుంచే అనేది అందరికీ తెలిసిందే. కడుపు శుభ్రంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. కడుపు శుభ్రంగా ఉండటం అనేది ఆ వ్యక్తి విసర్జన వ్యవస్థను బట్టి ఉంటుంది. ఇటీవలి కాలంలో చెడు ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్, మసాలా ఆహార పదార్ధాలు, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల మలబద్ధకం సమస్య ప్రధానంగా కన్పిస్తోంది. దాంతో కడుపు క్లీన్ కాకపోవడంతో కడుపు నొప్పి, అసౌకర్యం ఇతర లక్షణాలు కన్పిస్తుంటాయి. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. అయితే ఇక్కడ మేం మీకు వివరించే హోమ్ రెమిడీస్ పాటిస్తే మలబద్ధకం సమస్య చిటికెలో పరిష్కారం చూపించవచ్చు.

మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే కొన్ని రకాల యోగాసనాలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. కొన్ని సులభమైన ఆసనాలు వేయడం ద్వారా మలబద్ధకం సమస్యను ఇట్టే దూరం చేయవచ్చు. జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. మర్కటాసనం కీలకమైంది. ఇందులో వీపు ఆధారంగా నిటారుగా కూర్చోవాలి. రెండు కాళ్లు వెనక్కి మడిచి కూర్చోవాలి. ఇలా కాస్సేపుండాలి. ఆ తరువాత రెండోవైపు నుంచి ఇదే ఆసనం రిపీట్ చేయాలి. 

పనన ముక్తాసనంలో వీపుపై పడుకోవాలి. రెండు కాళ్లు కలిపి నిటారుగా చేయాలి. నెమ్మది నెమ్మదిగా రెండు మోకాళ్లు మడిచి మీ ఛాతీకి ఆన్చాలి. రెండు చేతులతో మోకాళ్లను పట్టుకోవాలి. తలను నేల నుంచి పైకి లేవకూడదు. ఈ స్థితిలో కాస్సేపు ఉండాలి. నెమ్మది నెమ్మదిగా శ్వాస వదులుతూ పీల్చుతూ ఉండాలి. దీనివల్ల గ్యాస్ సమస్య ఉంటే పోతుంది.

వజ్రాసనంలో మోకాళ్లపై కూర్చోవాలి. రెండు కాళ్ల పంజాలను కలిపి కూర్చోవాలి. మడమ కింద ఆన్చాలి. వెన్నుముక నిటారుగా ఉంచాలి. చేతులు మోకాళ్లకు ఆన్చాలి. ఇలా కాస్సేపు ఉండి శ్వాస దీర్ఘంగా తీయడం వదలడం చేయాలి. దీనివల్ల జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

బాలాసనంలో ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. ఇప్పుడు మడమలపై ఆన్చి నుదుటిని నేలకు ఆన్చాలి. రెండు చేతులు శరీరం ఇరువైపులకు చాచాలి. ఇలా కాస్సేపు ఉండి శ్వాస గట్టిగా పీల్చడం, వదలడం చేయాలి. ఈ ఆసనాలు చేయడం వల్ల మలబద్ఖకం సమస్య పోతుంది. అదే సమయంలో వైద్యుని సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా యోగాసనాలపైనే ఆధారపడకూడదు.

Also read: Tax Saving Tips: ఇలా చేస్తే మీ ఆదాయం 12 లక్షలున్నా సరే నో ట్యాక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News