Oppo Reno 11A Price: 5000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ Oppo Reno 11A మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Oppo Reno 11A Price: ఒప్పో (Oppo) నుంచి మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ అందుబాటులోకి రాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 21, 2024, 02:45 PM IST
Oppo Reno 11A Price: 5000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జింగ్ Oppo Reno 11A మొబైల్‌ లాంచ్‌ కాబోతోంది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌!

Oppo Reno 11A Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో (Oppo) కంపెనీ త్వరలోనే గుడ్‌న్యూస్‌ తెలపబోతోంది. ఒప్పో కంపెనీ Reno సిరీస్‌లోనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది Oppo Reno 11A పేరుతో మార్కెట్‌లోకి రానుంది. అయితే ఇప్పటికే కంపెనీ ఈ మొబైల్‌ను జపాన్‌లో విడుదల చేసింది. ఇక ఈ మొబైల్‌ అతి శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రానుంది. దీని బ్యాక్‌ సెటప్‌లో ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

Oppo Reno 11A ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
ఈ Oppo Reno 11A స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన AMOLED 6.7-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది పూర్తి HD ప్లస్ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఈ డిస్ల్పే  120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌ ColorOS 14 ఆధారంగా ఆండ్రాయిడ్ 14పై రన్‌ అవుతుంది. అలాగే సెక్యూరుటీ కోసం కంపెనీ ఇందులో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా దీని బ్యాక్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇందులోని ప్రధాన కెమెరా 64-మెగాపిక్సెల్‌ను కలిగి ఉంటుంది. అలాగే అదనంగా 8-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్,  2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలను కూడా కంపెనీ అందిస్తోదంఇ. దీంతో పాటు ఇక ఫ్రంట్‌లో 32-మెగాపిక్సెల్ ఫేసింగ్ కెమెరాను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

Oppo Reno 11A లాంచ్ తేది:
ఇక ఈ Oppo Reno 11A స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ర్యామ్‌, ప్రాసెసర్‌ వివరాల్లోకి వెళితే, ఇది డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు కంపెనీ ఈ మొబైల్‌ను 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ మొబైల్‌ను కంపెనీ జూన్ 27న గ్లోబల్‌ లాంచింగ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ  Oppo Reno 11A స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.48,800తో విడుదలయ్యే ఛాన్స్‌ ఉంది. దీనిని కంపెనీ ముందుగా మూడు కలర్‌ ఆప్షన్స్‌లో తీసుకు రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన అధికారిక సమాచారాన్ని కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఇతర ఫీచర్స్‌:
Wi-Fi 802.11ax
బ్లూటూత్ 5.2
GPS, NFC
USB టైప్-C పోర్ట్
IP65 రేటెడ్ ఛాసిస్ 
డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌
67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000mAh బ్యాటరీ

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News