Itlu Mee Cinema: ఆలోచింపజేసే 'ఇట్లు మీ సినిమా'.. ఎలా ఉందంటే..

Itlu Mee Cinema Movie Review: తెలుగులో సినిమా నేపథ్యంలో ఇప్పటి వరకు పలు చిత్రాలు తెరకెక్కాయి. ఖడ్గం, నేనింతే ఈ తరహా చిత్రాలనే చెప్పాలి. అలాంటి సినిమానే శ్వాసగా, ధ్యాసగా భావించే నలుగురు యువకులు తామనుకున్న కలలను సాకారం చేసుకున్నారా లేదా అనేదే 'ఇట్లు మీ సినిమా'. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో  చూద్దాం..  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 21, 2024, 05:15 PM IST
Itlu Mee Cinema: ఆలోచింపజేసే 'ఇట్లు మీ సినిమా'.. ఎలా ఉందంటే..

రివ్యూ: ఇట్లు మీ సినిమా (Itlu Mee Cinema)
నటీనటులు: అభిరామ్,వెన్నెల, మనోహర్, పవన్, మంజుల, ప్రదీప్, అమ్మ రమేష్ తదితరులు..
నిర్మాత: నోరి నాగ ప్రసాద్
మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరీష్ చావా
విడుదల తేది: 21-6-2024

అభి రామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'ఇట్లు... మీ సినిమా'.  హరీష్ చావా డైరెక్షన్‌లో తెరెక్కిన ఈ సినిమాను నోరి నాగ ప్రసాద్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. అమ్మరమేష్, ప్రదీప్ లీడ్ రోల్స్ ప్లే చేసారు. మొత్తంగా సినిమాపై ప్రేమతో ఈ రంగానికి వచ్చిన వాళ్లు సినీ రంగంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి ? చివరకు సక్సెస్ అయ్యారా లేదా అనేదే ఈ మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..
రామ్ (అభిరామ్) ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తనకు సినిమాలంటే ప్యాషన్. దీంతో హీరో అవ్వాలనుకునే అతను తాను చేస్తోన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని సైతం ఒదలిపెట్టి హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో సినిమా ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఇతనికి తోడుగా మరో ముగ్గురు (మనోహర్, పవన్, కృష్ణ) కలుస్తారు. ఈ నలుగురు తమ వంతుగా సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ కోవలో రామ్ కి జాను (వెన్నెల)ను ప్రేమిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో వెన్నెల తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. అతను మాత్రం సినిమాల్లో సెటిల్ అయ్యాకే చేసుకుంటానని చెబుతుంటాడు. మొత్తంగా రామ్, జానుల ప్రేమ ఫలవంతం అయిందా.. ? సినిమా ప్రయత్నాలు చేస్తోన్న నలుగురు తాము కోరకున్న సినిమా ఛాన్సులు దక్కించుకున్నారా లేదా అనేదే 'ఇట్లు మీ సినిమా' స్టోరీ.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

సినిమా ఇండస్ట్రీ అందులో హీరో, హీరోయిన్స్ కావాలనుకుని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వాలిపోతుంటారు. అంతేకాదు సినిమాల్లో ఛాన్సుల కోసం నిద్రాహారాలు మానుకున్న వాళ్లు ఉన్నారు. ఈ కోవలో తెలుగులో ఎన్నో చిత్రాలొచ్చాయి. అందులో గురువు దాసరి నారాయణరావు తెరకెక్కించిన 'శివరంజని', అద్దాల మేడ వంటి చిత్రాలొచ్చాయి. ఆ తర్వాత కృష్ణ వంశీ తెరకెక్కించిన 'ఖడ్గం', 'నేనింతే' సినిమాలు కూడా  సినీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలని చెప్పాలి. తాజాగా వచ్చిన 'ఇట్లు మీ సినిమా' కూడా అదే తరహా కథాంశంతో తెరకెక్కించాడు దర్శకుడు హరీష్‌ చావా. తాను సినీ రంగంలో ఎదుర్కొన్న అనుభవాలను ఈ సినిమాలో చూపించినట్టు కనిపిస్తోంది ఆయా సన్నివేశాలను చూస్తుంటే.

సినిమాపై అభిమానంతో మోజుతో ఈ రంగంలో స్థిరపడాలనుకునే యువకులు ఎంతో మంది ఉన్నారు. మంచి జాబ్ ను, బిజినెస్ ను వదిలేసి... సినిమా రంగంలో రాణించాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొంత మందే సక్సెస్ కావొచ్చు. కానీ సినిమా రంగంలో సెటిలైపోవాలని ఎంతో మంది ఆశలపల్లకిలపై ఊరెగుతూ ఇక్కడికి వచ్చేవారు ఎందరో ఉన్నారు. వారు సినిమా రంగంలో రాణించాలే కసి, పట్టుదలను తెరపై ఆవిష్కరించాడు. మొత్తంగా సినిమా రంగంలో రాణించాలనుకున్న నలుగురు కుర్రాళ్ల తపన ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తోంది.

ఈ క్రమంలో కొంత మంది సక్సెస్ అవ్వొచ్చు... కొంత మంది సక్సెస్ కాకపోవచ్చు. కానీ ప్రయత్నం అనేది సాగిస్తేనే... దానికి సార్థకత ఉంటుంది. చాలా నిజయతీగా పట్టుదలతో ప్రయత్నిస్తే... రాణించలేని రంగం అంటూ ఏదీ ఉండదనేది ఇందులో ఓ మెసేజ్ రూపంలో చూపించారు దర్శకుడు. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో కష్టాలు ఎక్కువ... సక్సెస్ కాలేమనే వారికి ఇందులో నలుగురు యువకులు ఎంతో పట్టుదలో చేసే ప్రయత్నమే వారికి స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాంటి పాయింట్ తో దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా ప్రయత్నాల కోసం యువకులు పడే పాట్లను చూపించి... సెకెండాఫ్ లో కేవల ప్రయత్నాలే కాదు... తామే ఓ సినిమాని ఎందుకు తీయకూడదు... అందకు కావాల్సిన వనరుల్ని క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఎందుకు సమకూర్చకోకూడదని ఆలోచించి... చివరకు ఓ మంచి మూవీని తీసి విజయం సాధిస్తారు. ఇలాంటి స్పూర్తి దాయకమైన ప్లాట్ ను దర్శకుడు చాలా మెసేజ్ ఓరియంటెడ్ గా... లవ్, రొమాన్స్ తదితర వాటిని మేళవించి తెరకెక్కించారు. సినిమా రంగంలో సెటిల్ అవ్వాలనే యువకులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. అంతేకాదు సినీ రంగంలోని కాస్టింగ్ కౌచ్ ను కూడా ఈ సినిమాలో రియలిస్టిక్ గా చూపించాడు.

డైరెక్టర్ సినీ ఇండస్ట్రీలోని కష్టాలపై రాసుకున్న స్టోరీ, స్క్రీన్ ప్లే  ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తోంది. మొత్తంగా సినిమా ఇండస్ట్రీలోని మంచి చెడులను తెరపై చక్కగా ఆవిష్కరించాడు.
అలాగే  సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే కుర్రాళ్లకు ప్రొడ్యూసర్స్ డబ్బులు కొంత మీరూ పెట్టండి.... మిగతాది నేను చూసుకుంటా అని చెప్పడం... ఇలాంటి సీన్స్ అన్నీ స్ర్కీన్ పై  మీద చాలా సహజంగా అనిపిస్తాయి. పాటలు జస్ట్ ఓకే.  సంభాషణలు పర్వాలేదు.  సినిమాటోగ్రఫీ బాగుంది.

నటీనటుల విషయానికొస్తే..
ఈ సినిమాలో నటించిన అభిరామ్, వెన్నెలతో పాటు మనోహర్, పవన్ , కృష్ణలు తమ పాత్రలకు న్యాయం చేసారు. కాస్టింగ్ పేరుతో మోసం చేసే పాత్రలో నటించిన నటుడు బాగా చేసాడు. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

రేటింగ్: 2.75/5

Read more: Viral video: అట్లుంటదీ మల్ల.. నరసింహ మూవీ స్టైల్ లో పాముకు కిస్ ఇచ్చిన తాత.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News