Budget 2024: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్‌ ఆఫర్.. పదేళ్ల నిరీక్షణకు తెర ఈ బడ్జెట్‌లో బిగ్‌ గిఫ్ట్‌..

Budget 2024: సాధారణంగా ఇది పదవీవిరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. 2014 సెప్టెంబర్‌ 1 వరకు ఈ పరిమితి రూ. 6500 ఉండేది. ఆ తర్వాత నుంచి రూ. 15,000 పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ గరిష్ట పరిమితిగా చేశారు. 

Written by - Renuka Godugu | Last Updated : Jul 4, 2024, 04:43 PM IST
Budget 2024: పీఎఫ్ ఖాతాదారులకు బంపర్‌ ఆఫర్.. పదేళ్ల నిరీక్షణకు తెర ఈ బడ్జెట్‌లో బిగ్‌ గిఫ్ట్‌..

Budget 2024: రానున్న బడ్జెట్‌లో పీఎఫ్‌ ఖాతాదారులకు ఎన్‌డీఏ ప్రభుత్వం బంపర్‌ ఆఫర్ ప్రకటంచనుంది. ఈ నెలలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో పీఎఫ్‌ పై ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇది పీఎఫ్ ఖాతాదారులకు బిగ్‌ గిఫ్ట్‌. ఎన్నో ఏళ్లుగా నిరీక్షణకు తెరపడనుంది. ఈపీఎఫ్‌ఓ ఖాతాదారుల పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 15,000 నుంచి రూ. 25,000 కు చేయనుందట. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధం చేస్తున్నారట. దాదాపు పదేళ్లుగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిపాదననను కార్మిక మంత్రిత్వ శాఖ ఇప్పటికి రెడీ చేసింది. దీంతో ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నవారికి గుడ్‌ న్యూస్‌ ఈ రానున్న బడ్జెట్లోనే ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

పీఎఫ్ అనేది ఉద్యోగుల భవిష్యనిధి. దీన్ని వారి అవసరాల నిమిత్తం, భద్రతకు గాను బేసిక్‌ పే పై 12 శాతం పీఎఫ్‌ కట్ అవుతుంది. ఇది రూ. 15,000 జీతం ఉంటే ప్రతి ఒక్క ఉద్యోగి ఈ పథకంలో చేరాల్సిందే. ముఖ్యంగా ఉద్యోగుల సామాజిక భద్రత కోసం ఈ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మొత్తాన్ని ఉద్యోగస్థులు తమ అవసరం నిమిత్తం అంటే పెళ్లి, ఇంటి నిర్మాణం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డబ్బులు ఉపసంహరించుకోవచ్చు.  దీనికి ఓ యూఏఎన్‌ అని ఖాతా నంబర్‌ ఇస్తారు. దీంతో నేరుగా ఎంప్లాయి డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: జియో యూజర్లకు మరో భారీ షాక్‌.. ఎక్కువశాతం రీఛార్జీ చేసుకునే ఆ 2 ప్లాన్లు తొలగింపు..

సాధారణంగా ఇది పదవీవిరమణ తర్వాత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. 2014 సెప్టెంబర్‌ 1 వరకు ఈ పరిమితి రూ. 6500 ఉండేది.  ఆ తర్వాత నుంచి రూ. 15,000 పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ గరిష్ట పరిమితిగా చేశారు. ప్రస్తుతం ఈ పరిమితిని రూ. 25,000 రానున్న బడ్జెట్‌లో చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఈ పోస్టు ఆఫీస్‌ పథకంలో పెట్టుబడి పెడితే రూ. 80,000 వడ్డీ వస్తుంది..

1952 నవంబర్ 1 - 31 మే 1957 వరకు రూ. 300.
1957 జూన్ 1 - 30 డిసెంబర్ 1962 వరకు రూ.500.
1962 డిసెంబర్ 31  -10 డిసెంబర్ 1976 రూ.    1000 ... 
 1976  డిసెంబర్ 11 - 31 ఆగస్టు 1985 రూ.    1600 
1985 సెప్టెంబర్ 1 - 31 అక్టోబర్ 1990 రూ.    2500
1990 నవంబర్ 1 నుండి 30 సెప్టెంబర్ 1994 రూ.3500 
1994 నుండి 31 మే 2011 వరకు రూ. 5000 
2001 జూన్ 1 - 31 ఆగస్టు 2014 రూ.6500 
2014 సెప్టెంబర్ 1 - ఇప్పటివరకు    రూ. 15000 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News