Mars Transit 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అంగారక గ్రహానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అన్ని గ్రహాలకు ఈ గ్రహాన్ని రాకుమారుడిగా పిలుస్తారు. అంతేకాకుండా దీనిని ధైర్యం, బలం, విశ్వాసాలకు సూచికగా కూడా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహం జాతకంలో అనుకూల స్థానంలో ఉంటే సంపద, ధైర్యానికి ఎలాంటి లోటు ఉండదు. ఇదిలా ఉంటే ఈ గ్రహం జూలై 12వ తేదిన వృషభ రాశిలోకి సంచారం చేయబోతోంది. వృషభ రాశిలోకి ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
కుజుడిని బలంతో పాటు ధైర్యానికి సూచికగా భావిస్తారు. కాబట్టి ఈ గ్రహం జాతకంలో శుభ స్థానంలో ఉంటే ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అదే ఈ గ్రహం అశుభ స్థానంలో ఉంటే విజయాలు సాధించే క్రమంలో అనేక ఇబ్బందులు తలెత్తే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా సమాజంలో కీర్తి, ప్రతిష్టలు కూడా దూరమవుతాయి.
ఈ రాశులవారిపై కుజుడి చెడు ప్రభావం:
కుజుడు జూలై 12న రాత్రి 7 గంటల సమయంలో వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే ఈ గ్రహం ఆగస్టు 26వ తేది వరకు అదే రాశిలో సంచార క్రమంలో ఉంటాడు. దీంతో 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. అందులో మూడు రాశులవారు తీవ్ర దుష్ప్రభావాలకు గురవుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మిథున రాశి:
అంగారక సంచారం కారణంగా మిథున రాశివారికి ఉత్సాహం పెరిగి ఎలాంటి పనులైనా చేసే అవకాశాలు ఉన్నాయి. దీని కారణంగా తీవ్ర ఇబ్బందుల బారిన పడతారు. అంతేకాకుండా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే శత్రువులు కూడా ఎంతో చురుకుగా ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి అనేక సమస్యలు రావచ్చు. కెరీర్‌కి సంబంధించిన విషయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కర్కాటక రాశి:
కుజుడి సంచార ప్రభావం కర్కాటక రాశివారిపై కూడా పడుతుంది. దీని కారణంగా వీరు ఆర్థికంగా నష్టపోతారు. అలాగే పెట్టుబడులు పెట్టడం వల్ల అనేక ఆర్థిక సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీంతో పాటు డ్రైవింగ్ చేసే క్రమంలో వీరు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వీరు ఈ సమయంలో ఎక్కువగా మందుల కోసం డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కుంభ రాశి:
కుంభ రాశివారిపై కూడా కుజుడి ప్రభావం పడబోతోంది. దీని కారణంగా వీరికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక విషయంలో అనేక ఒడిదుడులు రావచ్చు. అలాగే ఎదైనా పనులు ప్రారంభించే ముందు తప్పకుండా ఇతరుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి