Masked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Masked Aadhaar Card: ఆధార్ కార్డు అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. ఐడీ ప్రూఫ్, వ్యక్తిగత వివరాల నిర్ధారణకు ఆధార్ కార్డు కంటే ప్రత్యామ్నాయం మరొకటి లేదు. అందుకే ఆధార్ కార్డును అత్యంత గోప్యంగా ఉంచడమే మంచిది. అలా చేయాలంటే ఏం చేయాలి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 9, 2024, 01:22 PM IST
Masked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

Masked Aadhaar Card: ఇటీవలి కాలంలో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. అన్నింటికీ అదే ఆధారమైంది. అందుకే ఆధార్ వివరాలను సాధ్యమైనంతలో గోప్యంగా ఉంచుకోవాలి. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా మాస్క్డ్ ఆధార్ కార్డు ప్రవేశపెట్టింది. దీని వల్ల ప్రయోజనాలేంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం..

ఆధార్ కార్డు వినియోగం పెరగడం, ఐడీ ప్రూఫ్‌గా అందరూ ఆధార్ కార్డును అంగీకరిస్తుండటంతో వ్యక్తిగత వివరాలు ఇమిడి ఉన్న ఈ కార్డును జాగ్రత్తగా ఉంచుకోవల్సి ఉంటుంది. లేకపోతే మీ వ్యక్తిగత వివరాలు ఇతరుల చేతికి చిక్కే అవకాశముంది. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు ఇతరుల ఆధార్ కార్డు ఉపయోగించి ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఉపయోగించే పరిస్థితి. ఇతరులు మీ ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండాలంటే మాస్క్డ్ ఆధార్ చాలా అవసరమౌతుంది. మాస్క్డ్ ఆధార్ అనేది ఇతర ఆధార్ కార్డులతో విభిన్నమైందే కాకుండా సురక్షితమైంది కూడా. 

సాధారణ ఆధార్ కార్డులో 12 అంకెలు స్పష్టంగా కన్పిస్తాయి. కానీ మాస్క్డ్ ఆధార్ కార్డులో అలా ఉండదు. చివరి 4 అంకెలు మాత్రమే కన్పిస్తాయి. మిగిలిన అంటే మొదటి 8 అంకెలు XXXX-XXXX ఇలా ప్రింట్ అయుంటాయి. దాంతో ఇతరులు లేదా మీ ఆధార్ కార్డు జిరాక్స్ అక్రమంగా పొందిన అక్రమార్కులకు ఆధార్ నెంబర్ కన్పించదు. 

మాస్క్డ్ ఆధార్ కార్డు అనేది పూర్తిగా వ్యాలిడ్. యూనిక్ ఐడెంటిటీ అధారిటీ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. సాధారణ ఆధార్ కార్డు ఉపయోగించినట్టే దీనిని కూడా ఉపయోగించవచ్చు. ఎక్కడైనా ఆధార్ కార్డు వివరాలు ఇచ్చేటప్పుడు మాస్క్డ్ ఆధార్ కార్డు ఇవ్వాలని ఇప్పటికే యూఐడీఏఐ చాలాసార్లు స్పష్టం చేసింది. 

మాస్క్డ్ ఆధార్ కార్డు ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

ముందుగా అధికారిక పోర్టల్ myaadhaar.uidai.gov.in ఓపెన్ చేసి లాగిన్ అవాలి. అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా కోడ్, ఎంటర్ చేసి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీతో ధృవీకరించాలి. ఇప్పుడు సర్వీసెస్ సెక్షన్ నుంచి డౌన్‌లోడ్ ఆధార్ కార్డు ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు మాస్క్డ్ ఆధార్ కార్డు ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకోవాలి. మాస్క్డ్ ఆధార్ అనేది ఎప్పుడూ పాస్‌వర్డ్ ఆధారిత పీడీఎఫ్ ఫార్మట్‌లో ఉంటుంది. పాస్‌వర్డ్ అనేది మీ పేరులోని మొదటి నాలుగు అక్షరాలు పుట్టిన సంవత్సరం కలిపి ఎంటర్ చేయాలి. ఉదాహరణకు మీ పేరు Dinesh అయి పుట్టిన సంవత్సరం 1980 అయితే పాస్‌వర్డ్ DINE1980 అవుతుంది.

Also read: Post office Superhit Scheme: 5 లక్షల పెట్టుబడిపై 2.25 లక్షలు వడ్డీ, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News