బ్రహ్మానందానికి జీవిత సాఫల్య పురస్కారం

Last Updated : Nov 6, 2017, 10:19 AM IST
బ్రహ్మానందానికి జీవిత సాఫల్య పురస్కారం

టాలీవూడ్ హాస్య నటుడు బ్రహ్మానందం  'జీవిత సాఫల్య పురస్కారం' అనుకున్నారు. తెలుగు అకాడమి 29వ వార్షికోత్సవం సందర్భంగా  ఆదివారం న్యూదిల్లీ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. సినీనటులు మురళీమోహన్, తనికెళ్ళ భరణి, అలీ, రవికుమార్, సాయికుమార్ లకు కూడా అవార్డులు దక్కాయి. 

వివిధ రంగాలలో సేవలు అందించిన ఇతర ప్రముఖులను కూడా ఇదే వేదికపై అవార్డులతో సత్కరించారు. సామాజికసేవలో గురుప్రసాద్, విద్యారంగంలో రావూరి వెంకట స్వామి, వైద్య రంగంలో దశరథ రామరెడ్డి, ఆర్థిక రంగంలో మహేష్ వై. రెడ్డి లు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యాక్రమంలో అస్సామ్ గవర్నర్ జగదీష్, కేంద్ర మంత్రి మహేష్ శర్మ, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ పీవీ నారాయణన్ లు పాల్గొన్నారు. 

Trending News