Diabetes Exercise At Home: ప్రస్తుతం చాలా మంది గంటల తరబడి ఉద్యోగాలలో ఎక్కువ సేపు కూర్చోవలసినవిగా మారాయి. ఈ మారిన జీవన శైలి కారణంగా పొట్ట చుట్టూ కొవ్వు పెరగడానికి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయడం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చు. యోగా చేయడం వల్ల శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అయితే వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుతం డయాబెటిస్ వ్యాధితో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు ఆహారం, శరీరం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ మండూకాసనం చేయడం ప్రారంభించండి. రోజుకు మూడు నుం,చి నాలుగు సార్లు ఈ ఆసనం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అసలు మండూకాసనం అంటే ఏంటి? ఇలా చేయడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఈ యోగా చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఇక్కడ తెలుసుకుందాం.
మండూకాసనం:
మండూకాసనం అనేది ఒక యోగా భంగిమ. దీనిని కప్ప భంగిమ అని కూడా పిలుస్తారు. ఈ భంగిమలో శరీరం ఒక కప్ప ఆకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆసనం హఠా యోగా, ఆధునిక యోగాలో భాగం. ఈ ఆసనం చేయడాని కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఎలా చేయాలి అనేది ఇక్కడ తెలుసుకోండి.
మండూకాసనం చేయడానికి విధానం:
మొదట వజ్రాసనంలో కూర్చోండి. మీ పాదాలను కలిపి, వెనుక వైపు మడవండి. మీ చేతులను మీ పక్కల ఉంచండి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ, మీ శరీరాన్ని ముందుకు వంచండి. మీ మోకాళ్ళు మీ ఛాతీకి దగ్గరగా రావాలి.
మీ చేతులను మీ మోకాళ్లపై ఉంచండి. మీ తలను నేలపై ఆన్చండి లేదా మీ గడ్డం మీ ఛాతీపై ఉంచండి. ఈ భంగిమలో 30 సెకన్ల నుండి ఒక నిమిషం పాటు ఉండండి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ, ప్రారంభ స్థితికి తిరిగి రండి. ఇలా చేయడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారికి ఎన్నో లాభాలు వస్తాయి.
మండూకాసనం ప్రయోజనాలు:
మండూకాసనం ఉష్ణోగ్రతలను పెంచుతుంది. ఇది శరీరంలోని చెక్కర స్థాయిలను నియంత్రించడంలో ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా ఈ భంగిమ కడుపు అవయవాలకు మసాజ్ చేస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. డయాబెటిస్ సమస్యతో బాధపడేవారిలో జీర్ణక్రియ సమస్య ఉంటుంది. కాబట్టి ఈ ఆసనం చేయడం వల్ల సమస్యకు చెక్ పెట్టవచ్చు. కొంతమందిలో కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పి, మెడ నొప్పి, వంటి ఇతర నొప్పులు కలుగుతాయి. ఈ సమస్యలు ఉన్నవారు మండూకాసనం చేయడం వల్ల వెన్నునొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఇది వెన్నెముకను సాగదీస్తుంది. వెనుక భాగంలోని కండరాలను బలోపేతం చేస్తుంది.
ఈ భంగిమ ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. మండూకాసనం శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు మండూకాసనం ప్రత్యేక ప్రయోజనాలు:
మండూకాసనం మధుమేహం ఉన్నవారికి చాలా ప్రయోజనకరమైనది ఎందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈ భంగిమ శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి సహాయపడుతుంది. మండూకాసనం ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, ఇది మధుమేహం నియంత్రణకు ముఖ్యం.
గమనిక: మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ భంగిమను ప్రయత్నించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి