Severe Heavy Rain Alert in Ap: బంగాళాఖాతంలో ఒడిశా-ఉత్తరాంద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయగుండంగా మారింది. ఫలితంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పూరీ సమీపంలో ఇవాళ తీరం దాటనుండటంతో ఉత్తరాంధ్రకు అతి భారీ వర్ష హెచ్చరిక జారీ అయింది. ఇక కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో సైతం భారీ వర్షాలు పడనున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి ఇవాళ ఒడిశా పూరీ సమీపంలో తీరం దాటనుంది. ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతుండగా రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యగా ఉత్తరాంధ్రలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నాయని వెల్లడించింది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నాయి. అటు కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరిక పొంచి ఉంది.
ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, విజయనగరం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో పడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కడప, సత్యసాయి, పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఏపీలో రేపు ఉదయం వరకూ వర్షాలు కొనసాగి ఆ తరువాత తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
వాయుగుండం తీరం దాటే సమయంలో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో వీయనున్నాయి. దాంతో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 23వ తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలుస్తోంది. ఇక ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది. ఈ రెండు జిల్లాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని విద్య సంస్థలకు సెలవు ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook