అయోధ్య కేసు : మధ్యవర్తిత్వ ప్రక్రియకు మరింత గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు

అయెధ్య భూ వివాదం కేసు విచారణ మరోసారి వాయిదా పడింది

Last Updated : May 10, 2019, 12:39 PM IST
అయోధ్య కేసు : మధ్యవర్తిత్వ ప్రక్రియకు మరింత గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు

అయోధ్య భూ వివాదం కేసులో మధ్య వర్తుల కమిటీ సమర్పించిన నివేదికపై సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తి చేయడానికి  గడువును ఆగస్టు 15 వరకు పొడగించింది. మధ్యవర్తిత్వ కమిటీ విఙ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ మేరకు గడువును పొడగించింది. నిర్ణీత గడువులోపు మధ్యవర్తిత్వ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ , జస్టిస్‌ బోబ్డే, చంద్రచూడ్‌, అశోక్‌భూషణ్‌, అబ్దుల్‌ నజీర్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.  అనంతరం ఈ కేసు విచారణను వాయిదా వేసింది.

అయెధ్య భూ వివాదం విషయంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకోమని తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు..ఈ సమస్యను పరిష్కరించేందుకు మధ్య వర్తుల కమిటీ ఏర్పాటు చేస్తూ మార్చి 8న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఎఫ్ఎమ్ఐ ఖలిఫుల్లా నేతృత్వంలో శ్రీశ్రీ రవిశంకర్,  సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. నాలుగు వారాల్లోగా కమిటీ స్టేటస్ రిపోర్ట్ పూర్తి అవ్వాలని, ఎనిమిది వారాల్లోగా ప్రొసీడింగ్స్ పూర్తి అవ్వాలని అప్పట్లో సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో ఈ రోజు ధర్మాసనం ముందు హాజరైన కమిటీ సభ్యులు.. అయెధ్య సమస్యను స్నేహపూర్వకంగా పరిష్కరించేందుకు తమకు ఇంకా సమయం కావాలని కమిటీ కోరడంతో సుప్రీం దానికి అంగీకరించింది.

Trending News