Kantola Benefits: వర్షాకాలంలో మాత్రమే దొరికే బోడకాకర కాయ.. ఈ విషయాలు తెలిస్తే ఎగబడి తింటారు..

Kantola: అడవి కాకర కాయలు లేదా వీటినే బోడ కాకర కాయలు అనికూడా పిలుస్తారు. ఇవిముఖ్యంగా వర్షాకాలంలో మాత్రమే ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిలో పుష్కలమైన ఆయుర్వేద గుణాలు ఉన్నాయని చెబుతుంటారు. ఇవి తినడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. అందుకే వీటిని చాలా మంది వర్షాకాలంలో తప్పకుండా కొనుగోలు చేస్తారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Aug 7, 2024, 03:50 PM IST
  • అడవి కాకరకు మరల పెరిగిన డిమాండ్..
  • ఎక్కువగా కొనుగోలు చేస్తున్నజనాలు..
Kantola Benefits: వర్షాకాలంలో మాత్రమే దొరికే బోడకాకర కాయ.. ఈ విషయాలు తెలిస్తే ఎగబడి తింటారు..

Kantola amazing health benefits: సాధారణంగా ప్రతి సీజన్ లోను ఫలాలు, కూరగాయలు మార్కెట్ లోకి వస్తుంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే.. సీజన్ లో లభించే ఫలాలను మిస్ కాకుండా తింటు ఉండాలి. దీని వల్ల మనకు ఇమ్యునిటీ లభించడంతో పాటు, వ్యాధుల బారినపడకుండా ఉంటాం. ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది.ఈ కాలంలో ముఖ్యంగా.. బోడకాకర కాయలు మార్కెట్ లోకి వస్తుంటాయి.. దీనిలో అనేక రకాల విటమిన్ లు, మినరల్స్ లు పుష్కలంగా ఉంటాయి. అందుకే చాలా మంది బోడకాకర కాయల్ని ఎంతో ఇష్టంతో తింటారు.  దీనిలో ఆయుర్వేద గుణాలు కూడా ఉంటాయని చెబుతుంటారు.

అందుకు వర్షాకాలంలో వచ్చే బోడకాకరను చాలా మంది ఇష్టంతో తింటారు. కేవలం వర్షాకాంలో మాత్రమే బోడకాకరకాయలు లభిస్తుండటంతో .. వీరికి ఫుల్ గిరాకీ ఉంటుంది. మార్కెట్లో దీని ధరలు కొన్ని చోట్ల కేజీ 300 వరకు ఉంది. గ్రామాల్లో అయితే.. కేజీ 250 నుంచి 300 వరకు కూడా వీటిని విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. బోడకాకర  వల్ల.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో మాత్రమే బ్యాక్టిరియాలు, వైరస్ లు ఎక్కువగా ప్రవేశించి ఇబ్బందులు పెడుతుంటాయి. అందుకే మనం ఎల్లప్పుడు కూడా  ఇమ్యునిటీ సిస్టమ్ ను స్ట్రాంగ్ గా ఉంచుకొవాలి.

దీని వల్ల జీర్ణవ్వవస్థకు సంబంధించిన సమస్యలు దూరమౌతాయి. చాలా మంది తిన్న ఆహారం జీర్ణం కాక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటివారికి బోడ కాకర ఒక వరంలాంటిదని చెప్పుకొవచ్చు. ఇక షుగర్, బీపీ పెషెంట్లకు ఇది గొప్ప మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇది తింటే.. వీరి షుగర్, బీపీ లెవల్స్ పూర్తిగా కంట్రోల్ లో ఉంటాయి. గుండె దడ, ఆయాసం వంటి సమస్యలు ఉండవు. చాలా మంది యుక్త వయస్సులోనే ముఖంపై ముడతలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు బోడకాకర రసం, ఆకుల్ని రోజు తింటు ఉండాలి.

Read more: Vinesh Phogat: రక్తం తీసి.. వెంట్రుకలను కత్తిరించుకుని.. కన్నీళ్లు తెప్పిస్తున్న వినేష్ ఫోగట్ విశ్వ ప్రయత్నాలు..

తెల్ల వెంట్రుకల సమస్యలు ఉన్నవారు కూడా ప్రతిరోజు.. బోడకాకర గింజలను గ్రైండర్ లో వేసి, దాని పొడిని నూనెలో వేసి తలకు పెట్టుకొవాలి. ఇలా చేస్తు శరీరం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ప్రెగ్నెంట్ మహిళలకు ఎంతో ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో వచ్చే దురదలను తగ్గిస్తుంది. అల్సర్ వంటి ప్రభావాల్ని కూడా బోడకాకర కాయ తగ్గించే గుణాల్ని కల్గి ఉంటుంది. ఇది దగ్గుకు కూడా బాగా పనిచేస్తుందని. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News