Sirnapalli Waterfalls Travel Tips: వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఏదైనా ట్రెక్కింగ్, జలపాతాలు చూడాలనుకుంటారు. ప్రకృతి ప్రేమికులు దానికోసం ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతారు. ఎంత దూరమైన వెళ్తారు. ముఖ్యంగా పాలసముద్రంలా జాలువారే వాటర్ ఫాల్స్ చూడాలని ఎవరికి అనిపించదు. ఈరోజు మనం అది తెలంగాణలో ఉన్న ఓ జలపాతం గురించి చెప్పబోతున్నాం. జీవితంలో ఒక్కసారైనా ఈ జలపాతాన్ని చూడాలి అనిపిస్తుంది. మీరు కూడా ఇక్కడికి ఓసారి వెళ్లివస్తే ఆ ఆనందమే వేరు..
సాధారణంగానే ఈ మధ్యకాలంలో వీకెండ్ ట్రిప్స్ వేస్తున్నవారి సంఖ్య మరింత పెరిగింది. వీక్ డేస్‌లో వర్క్ లైఫ్ బిజీతో నలిగిపోయిన జీవితాలకు ఏ మాత్రం కాస్త సమయం దొరికినా వీకెండ్ ట్రిప్స్ వేస్తున్నారు. అటువంటి వారు ఈ సారి సిర్నాపల్లికి రండి.
సిర్నాపల్లి ఈ జాలువారే జలపాతం తెలంగాణలోని నిజామాబాద్‌లో ఉంది. దీనికి మరో పేరు కూడా ఉంది. అదే తెలంగాణ నయాగారా. ఈ జలపాతం ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సిర్నాపల్లి సంస్థానానికి చెందిన సీలం జానకి బాయి ఈ తటాకాన్ని నిర్మించారు. ఆమె వ్యవసాయానికి పెద్దపీఠ వేసి ఎన్నో సరస్సులు నిర్మించారని అంటారు. ఆమె తాగునీటి అవసరాల కోసం కూడా ఇక్కడ చెరువులు నిర్మించారని చెబుతారు.
ఇదీ చదవండి: రేపు భారత్‌తోపాటు ఈ 5 దేశాలకు కూడా ఇండిపెన్‌డెన్స్ డే.. ఆ దేశాలు ఏవో తెలుసా?
మీరు కూడా వీకెండ్ ట్రిప్ వేయాలనుకుంటే ఈ సిర్నాపల్లి జలపాతం చూసేయండి. ఈ ట్రిప్‌కు మీరు కేవలం 3 రోజులు కేటాయిస్తే ఎంచక్కా ఫ్యామిలీ లేదా స్నేహితులతో ఓ రౌండ్ వేసి రావచ్చు. ఖర్చు కూడా తక్కువే కాబట్టి ఈ టూర్ ఓసారి జీవితంలో వేసి రావాల్సిందే. పైనుంచి కిందకు నీటి జలపాతం జాలువారుతుంటే ఆ దృష్ట్యం కన్నులవిందుగా ఉంటుంది. మొత్తానికి బడ్జెట్ ఫ్రెండ్లీ.. సిర్నాపల్లి అని చెప్పవచ్చు. అవును అందుకే వీకెండ్స్ వస్తే చాలు ప్రకృతి ప్రేమికులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.
సిర్నాపల్లికి చేరుకోవడానికి రైలు మార్గం ఉంది. అంతేకాదు ఇక్కడకు బస్సులు కూడా వస్తాయి. హైదరాబాద్ నుంచి కూడా ఎన్నో బస్సులు అందుబాటులో ఉన్నాయి. సిర్నాపల్లి ఉన్న ఇందల్వాయి మండలం వరకు బస్సు మార్గాలు ఉన్నాయి. దానికి దగ్గరలోనే సిర్నాపల్లి జలపాతం ఉంటుంది. అంతేకాదు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా రైలు ప్రయాణం చేయవచ్చు. విశాఖ- నాందేడ్ ఎక్స్‌ప్రెస్ నిజామాబాద్ గుండా వెళ్తుంది. ఇంకా మరిన్ని రైళ్లు కూడా నిజామాబాద్ గుండా వెళ్తాయి.
ఇదీ చదవండి: రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులు
రైలులో ప్రయాణించినా ఖర్చు తక్కువ త్వరగా ప్రయాణం కూడా చేస్తారు. కుటుంబ సభ్యులతో వెళ్లడానికి ఇది సులభమైన మార్గం. ఒక పదివేలు ఉంటే చాలు కుటుంబ సభ్యులతో కలిసి ఎంచక్కా సిర్నాపల్లి జలపాతం చూసి రావచ్చు. ముఖ్యంగా తెలంగాణకు అతి చేరువలో ఉన్న ఈ వాటర్ ఫాల్‌కు ఒక్కసారి వెళ్లి వస్తే మళ్లి మళ్లి వెళ్తారు. అతి తక్కువ బడ్జెట్‌లో ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో ఒక్కసారైనా తిలకించాల్సిన బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ సిర్నాపల్లి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter