సరిగ్గా ఐదేళ్ల విరామం తర్వాత తిరుపతి గడ్డపై ప్రధాని మోడీ అడుగుపెడుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన జూన్ 9న తిరుమలోని శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు ప్రత్యేక హోదాపై మళ్లింది.
2014 ఎన్నికల సమయంలో తిరుపతి వేదిగా ప్రధాని మోడీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల దాన్ని అమలు చేయడం సాధ్యపడలేదు. అయితే ఇదే అంశం ఏపీలో కమలం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. పార్టీ మనుగడే కష్టంగా మారింది.
రాష్ట్రంలో కమలం పార్టీ మనుగడ కొనసాగాలంటే ప్రత్యేక హోదా గురించి ప్రకటించాల్సిన పరిస్థితి. మరి ఇలాంటి స్థితిలో ప్రధాని ఏం చెబుతారు. ప్రధాని తలచుకుంటే ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టం కాదంటున్నారు విశ్లేషకులు. మరి ప్రధాని తలచుకొని ఏపీ ప్రజలకు గుడ్ చెబుతారని ఏపీ ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈసారైనా ఏపీ ప్రజల ఆశలను వమ్మచేయండా ప్రత్యేక హోదా ప్రకటిస్తారా ? లేదా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.