Cholesterol Lowering Fruits: మనిషి శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హెచ్‌డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్. రెండవది ఎల్‌డీఎల్ చెడు కొలెస్ట్రాల్. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె వ్యాధుల ముప్పు పెరిగిపోతుంది. కొలెస్ట్రాల్ ఎంత ప్రమాదకరమైందంటే ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. కొలెస్ట్రాల్ తగ్గించాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. అదెలాగో తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మీ డైట్‌లో ఈ 4 పండ్లు తప్పకుండా ఉండాలంటారు వైద్యులు.
అవకాడో. కాస్త ఖరీదు ఎక్కువైనా బెస్ట్ ఫ్రూట్ ఇది. ఇందులో హెల్తీ ఫ్యాట్స్, బీటా సిటోస్టెరోల్ ఉంటాయి. ఫలితంగా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. అవకాడోను ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు. వారంలో కనీసం 3-4 సార్లు అవకాడో తినాల్సి ఉంటుంది.
ఆపిల్ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు మరో అద్భుతమైన ఫ్రూట్. యాపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అన్నారు. ఇది నిజం కూడా. రోజూ ఒక ఆపిల్ తింటే చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి. ఇందులో బయో యాక్టివ్ పోలీఫినోల్స్, ఫైబర్ పెద్దమొత్తంలో ఉండటం వల్ల రక్త నాళాల్లో పేరుకున్నకొలెస్ట్రాల్ తగ్గించవచ్చు. అంటే హార్ట్ ఎటాక్ రిస్క్ కూడా తగ్గుతుంది.
ఆప్రికాట్. హిందీలో ఖుబానీ అంటారు. ఇందులో ఫైబర్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా కొలెస్ట్రాల్ నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. రుచి కూడా బాగుంటుంది. చాలామంది స్వీట్స్‌లో వినియోగిస్తుంటారు
ఖర్జూరం. ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్ ఇది. ఇందులో ప్రోటీన్లు పెద్దమొత్తంలో ఉంటాయి. పైబర్ అధికంగా ఉంటుంది. ఫలితంగా కొలెస్ట్రాల్ చాలా వేగంగా తగ్గించవచ్చు. చాలామంది నేరుగా తింటుంటారు. ఖర్జూరం డ్రై రూపంలో కూడా తినవచ్చు.
Also read: Juice Precautions: బ్రేక్‌ఫాస్ట్‌తో ఈ 5 జ్యూస్‌లు ప్రమాదకరం, తస్మాత్ జాగ్రత్త
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook