Kushi 2: ఖుషి సినిమాపై నోరు జారిన స్టార్ హీరోయిన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హీరో ఫ్యాన్స్!

Priyanka Arul Mohan: సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎస్ జె సూర్యతో అభిమానుల తరఫున ఖుషి 2 చేస్తే పవన్ కళ్యాణ్ తోనే చేయమని చెప్పడంతో విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . ఏది ఏమైనా నోరు జారి ప్రియాంక మోహన్ చిక్కుల్లో పడిందని చెప్పవచ్చు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 28, 2024, 12:11 PM IST
Kushi 2: ఖుషి సినిమాపై నోరు జారిన స్టార్ హీరోయిన్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న హీరో ఫ్యాన్స్!

Vijay fans fires on Priyanka Arul Mohan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలలో ఖుషి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. అప్పటి వరకు బాక్సాఫీస్ రికార్డులు అన్నింటినీ కూడా ఈ చిత్రం బ్రేక్ చేసింది.  ఈ సినిమాతో పవన్ కళ్యాణ్.. మరొకసారి రికార్డు బ్రేక్ సొంతం చేసుకున్నారు. అంతేకాదు ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో.. ఒక మైలురాయిగా నిలిచిపోయింది. 

ఖుషి సినిమాకు సపరేటు ఫ్యాన్ బేస్ ఉందంటే ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందో ఊహించవచ్చు. ఇందులో భూమిక హీరోయిన్గా నటించగా,  ఎస్ జె సూర్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అంతేకాదు ఈ సినిమా రీ రిలీస్ లో కూడా సత్తా చాటింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా గురించి హాట్ కామెంట్స్ చేసింది హీరోయిన్ ప్రియాంక మోహన్. 

డాక్టర్, డాన్ వంటి చిత్రాలతో కోలీవుడ్ లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈమె, నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇప్పుడు మరొకసారి సరిపోదా శనివారం అనే సినిమాతో నాని సరసన నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈమె మాట్లాడిన మాటలు వివాదం సృష్టిస్తున్నాయి. 

సరిపోదా శనివారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఇందులో ప్రియాంక మోహన్ మాట్లాడుతూ.. నేను ఎస్ జె సూర్య సార్ తో తమిళంలో డాన్ చిత్రంలో నటించాను. ఇప్పుడు మళ్లీ సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నాను. అయితే అభిమానుల తరఫున నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. మీరు మళ్లీ ఎప్పుడు దర్శకత్వం చేస్తారు అని,  చేస్తే ఖుషి 2 చేయండి, అది పవన్ కళ్యాణ్ తో మాత్రమే చేయండి. ఎందుకంటే ఖుషి 2 ఒక క్లాసిక్ అంటూ అభివర్ణించింది ప్రియాంక.  అయితే ఈ విషయంపై  విజయ్ అభిమానులు తప్పుపడుతున్నారు. 

ఎందుకంటే తమిళంలో ఖుషి చిత్రాన్ని మొదట చేసి,  ఆ తర్వాత రీమేక్ గా తెలుగులో.. రిలీజ్ చేశారు. అలాంటిది ఖుషి 2 చేస్తే విజయ్ తో చేయాలి కానీ పవన్ కళ్యాణ్ తో చేయమని చెప్పడం ఏంటి అంటూ విజయ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రియాంక మోహన్ ను విజయ్ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం.

Also Read: Kavitha Released: 164 రోజులకు బయటి లోకాన్ని చూసిన కవిత.. తిహార్‌ జైలు నుంచి విడుదల

Also Read: MLC Kavitha Case: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ to బెయిల్.. పూర్తి వివరాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News