Lord ganesh chaturthi 2024: వినాయక చవితి పండుగను ప్రజలంతా ఎంతో భక్తితో జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 7 దేశంలో గణపయ్య చవితిని నిర్వహించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి గణేష్ చతుర్థి శనివారం రోజున వచ్చింది.
దేశమంతాట ఎక్కడ చూసిన కూడా వినాయక చవితి పండుగ సందడి కొనసాగుతుంది. మార్కెట్లన్ని పూలు, వినాయకుల విగ్రహాల అమ్మకాలతో సందడిగా మారాయి. ఎక్కడ చూసిన కూడా మార్కెట్లన్ని కలకలలాడుతున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ సారి వినాయక చవితి పండుగ శనివారం రోజు వస్తుంది. ముఖ్యంగా శనివారం శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైందని చెప్తుంటారు. అందుకే వినాయకుడితోపాటు, శనీశ్వరుడ్ని ఈ పూజలు చేస్తే ఆయన అనుగ్రహాం పుష్కలంగా లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
వినాయకుడ్ని పూజిస్తే మన విఘ్నాలన్ని దూరమైపోతాయి. అంతేకాకుండా..జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని చెబుతుంటారు. అయితే.. వినాయక చవితి రోజున చాలా మంది ఉండ్రాళ్లు, మోదకాలను తయారు చేసి స్వామి వారికి నివేదిస్తారు.
వినాయకుడి పూజతో పాటు, శనీశ్వరుడ్నికూడా తలచుకుని ఆయనను పూజిస్తే ఏలినాటి శని, అర్ధష్టమ, సాడేసాతి వంటి దోషాలన్ని దూరమౌతాయి. గణపయ్యకు.. ఎరుపురంగు పూలు, ఎర్రటి వస్త్రంలతో అలంకరించాలి.
శనీశ్వరుడికి నూనెతో అభిషేకం చేయాలి. నల్లనువ్వులు, నల్తని వస్త్రంను ఆయనకు సమర్పించాలి. అంతేకాకుండా.. పేదకలు అన్నదానం, వస్త్రాలను దానంగా ఇస్తే శనిప్రభావం ఉండదని కూడా పండితులు చెబుతున్నారు.
నల్ల చీమలకు చక్కెర, బెల్లం వంటివి పెట్టాలి. రావి చెట్టు,మేడి చెట్టు కింద దీపంను పెట్టాలి. ఇలా చేస్తే..మనకు శనిప్రభావం వల్ల కలిగే దోషాలన్ని కూడా దూరమౌతాయని చెబుతుంటారు.
మనం చేసే కర్మలను బట్టి, పనుల్ని బట్టి మాత్రమే శనీశ్వరుడి దానికి తగిన ఫలితాలు ఇస్తుంటాడు. అందుకే ఎల్లప్పుడు కూడా మంచి ఆలోచనలు, మంచి పనులు మాత్రమే చేయాలని కూడా పండితులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)