Twin Reservoirs Gates Open: భారీ వర్షాలతో వరద పోటెత్తిన వేళ హైదరాబాద్‌లోని ప్రధాన జలాశయాలు నిండుకున్నాయి. ఇప్పటికే నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ గేట్లు ఎత్తగా.. తాజాగా భాగ్యనగరానికి ప్రధాన నీటి వనరులైన జంట జలాశయాలు గేట్లు తెరచుకున్నాయి. హిమాయత్ సాగర్ , ఉస్మాన్ సాగర్‌ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో మూసీ నది పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తూ కనువిందు చేస్తోంది.
Also Read: Revanth Reddy: తెలంగాణకు రూ.5 వేల కోట్ల నష్టం.. కేంద్రం 'పెద్దన్న' సాయం చేయాలి
ఎగువన వర్షాలు కురుస్తుండడంతో హైదరాబాద్‌లోని జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు వరద నీరు ఇన్‌ఫ్లో భారీగా ఉంది. రెండూ పూర్తి ట్యాంక్ స్థాయికి (ఎఫ్‌టీఎల్) చేరుకున్నాయి. వరదను కిందకు వదిలేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. ఈ సంద్భంగా గేట్లకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఎత్తి వరదను కిందకు వదిలారు. హిమాయత్ సాగర్ ఒక గేటు, ఉస్మాన్ సాగర్ 2గేట్లు రెండడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు.
Also Read: KCR Yagam: మాజీ సీఎం కేసీఆర్ యాగం.. తన గారాలపట్టీ కల్వకుంట్ల కవిత కోసమే?
గేట్ల ఎత్తడంతో దిగువ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ప్రాంతాల్లో తిరగవద్దని సూచించారు. ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఒక్కో అడుగు మేర ఎత్తి 226 క్యూసెక్కులు నీటిని వదలగా... హిమాయత్ సాగర్ ఒక అడుగు ఎత్తి 340 క్యూసెక్కుల ప్రవాహం వదిలారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్‌కు 1,400 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. ఉస్మాన్ సాగర్‌కు 1,800 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది.
హిమాయత్ సాగర్
పూర్తి స్థాయి నీటి మట్టం - 1763.50 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి - 1761.10 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం - 2.970 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం - 2.455 టీఎంసీలు
ఉస్మాన్ సాగర్
పూర్తి స్థాయి నీటి మట్టం - 1790.00 అడుగులు
ప్రస్తుత నీటి స్థాయి - 1787.95 అడుగులు
రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 3.90 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం - 3.430 టీఎంసీలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.